ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే విజయం : చిరుమర్తి

ABN, First Publish Date - 2023-09-22T00:15:37+05:30

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధించి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే చి రుమర్తి లింగయ్య ధీమా వ్యక్తం చేశారు.

కలిమెరలో కుట్టు మిషన్లను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే లింగయ్య

రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే విజయం : చిరుమర్తి

కట్టంగూరు, నకిరేక ల్‌, సెప్టెంబరు 21: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధించి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే చి రుమర్తి లింగయ్య ధీమా వ్యక్తం చేశారు. కట్టంగూరులోని ఎంపీపీ కార్యాలయం లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్టాడారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను కాంగ్రెస్‌ మోసం చేస్తుందని అన్నా రు. కాంగ్రె్‌సలో ఎవరు సీఎం అవుతారో గ్యారంటీ లేదని, కాంగ్రెస్‌ ప్రకటించిన ఆ రు గ్యారంటీల పథకాలకు ఎవరు గ్యారంటీ ఇస్తారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే కేసీఆర్‌ను మూడోసారి సీఎంగా చేస్తాయని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలను మహిళలు స ద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే లింగయ్య అన్నారు. మండలంలోని కలిమెర గ్రామంలో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన మహిళలకు కుట్టు మిషన్లను పంపి ణీ చేశారు. నకిరేకల్‌ క్యాంపు కార్యాలయంలో మండలంలోని నడిగూడెం గ్రామానికి చెందిన మాద జానమ్మకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. 1 లక్ష విలువైన చెక్కును ఆయన అందజేశారు. అనంతరం కేతేపల్లి మండలం కొండకిందిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ నుంచి 30 కుటుంబాలు ఎ మ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాయి. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ జెల్లా ముత్తిలింగం, జడ్పీటీసీ తరాల బలరాం, సర్పంచులు పిన్నపురెడ్డి సైదిరెడ్డి, నంద్యాల నర్సిరెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, రా ములు, వెంకట్‌రెడ్డి, సైదిరెడ్డి, గోలి మంజుల వేణుమాధవర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T00:15:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising