ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టికెట్‌ ఇవ్వకుంటే పార్టీ మారతా

ABN, First Publish Date - 2023-06-29T03:04:16+05:30

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బీఆర్‌ఎ్‌సలో అసమ్మతి బయటపడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీఆర్‌ఎస్‌ నేత తీగల కృష్ణారెడ్డి.. అధిష్ఠానంపై అసంతృప్తి

సబితకు ప్రాధాన్యమెందుకంటూ ప్రశ్న

మహేశ్వరం, జూన్‌ 28: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బీఆర్‌ఎ్‌సలో అసమ్మతి బయటపడుతోంది. ఇప్పటికే పలువురు అసంతృప్త నాయకులు ఆ పార్టీని వీడివెళ్లగా.. మరికొంతమంది నేతలు కారు దిగేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వకపోతే తాను బీఆర్‌ఎ్‌సను వీడతానని ప్రకటించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నుంచి గెలిచి బీఆర్‌ఎ్‌సలో చేరిన సబితాఇంద్రారెడ్డికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. టీడీపీలో ఉన్నపుడే తనకు పదవులు లభించాయని, బీఆర్‌ఎ్‌సలో ఏ పదవీ దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులను జైల్లో పెట్టించిన సబితకు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఈసారి మహేశ్వరం నియోజకవర్గం నుంచి తనకే బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తాను ఎక్కడా తప్పు చేయలేదని, భూములు కబ్జాలు చేయలేదన్నారు. తనకు పార్టీ కార్యక్రమాల సమాచారం ఇవ్వడంలేదని, ఎన్నికల్లో ఓడిపోతే దూరం పెడతారా అంటూ ప్రశ్నించారు. ఈ సారి సిటింగులకే పార్టీ టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటిచడంతో తీగల కృష్ణారెడ్డి కాంగ్రె్‌సలో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో టీడీపీలో పనిచేసిన కాలంలో రేవంత్‌రెడ్డితో ఉన్న పరిచయం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుంటే తీగల కృష్ణారెడ్డి కాంగ్రె్‌సలోనే చేరతారన్న ప్రచారం స్థానికంగా జోరందుకుంది.

Updated Date - 2023-06-29T03:04:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising