ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ కబ్జా కేసులో..బీఆర్‌ఎస్‌ నాయకుడి అరెస్టు

ABN, First Publish Date - 2023-02-07T00:34:10+05:30

కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భూ కబ్జా కేసులో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ నేత, ‘కుడా’ మాజీ డైరెక్టర్‌ నన్నెబోయిన రమేశ్‌యాదవ్‌ అరెస్టు అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలివేల్పుల శివారులో భూ ఆక్రమణ వ్యవహారం

హనుమకొండ టౌన్‌, ఫిబ్రవరి 6 : కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భూ కబ్జా కేసులో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ నేత, ‘కుడా’ మాజీ డైరెక్టర్‌ నన్నెబోయిన రమేశ్‌యాదవ్‌ అరెస్టు అయ్యారు. కేయూ పోలీసులు ఆదివారం రాత్రి రమే్‌షయాదవ్‌తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న నన్నెబోయిన బాలయ్య, మేకల వెంకటే్‌షను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రమే్‌షయాదవ్‌తో పాటు మరో ఇద్దరిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది. మంగళవారం ముగ్గురిని రిమాండ్‌కు పంపే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కేయూ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పలివేల్పుల శివారులో 10గుంటల స్థలాన్ని కోతుల కుమారస్వామి అనే వ్యక్తి... గుండపురెడ్డి అన్నమ్మ వద్ద 1993లో కొనుగోలు చేశారు. ఈ స్థలంపై కన్నేసిన నన్నెబోయిన రమేశ్‌యాదవ్‌ నకిలీ పత్రాలతో తన తండ్రి నన్నెబోయిన బాలయ్య పేరుమీద డాక్యుమెంట్‌ సృష్టించి 2022లో మేకల వెంకటేశ్‌ అనే వ్యక్తికి విక్రయించాడు. ఈ స్థలం విషయంలో నెలకొన్న వివాదంపై కుమారస్వామి కే యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.

రమేశ్‌యాదవ్‌ను అరెస్టు చేసిన విషయాన్ని కేయూ ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ ధృవీకరించారు. పోలీసుల విచారణలో మరికొంతమంది పేర్లు బయటికి వచ్చే అవకాశాలున్నట్లు తెలిసింది.

Updated Date - 2023-02-07T00:34:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising