ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌వి అలవిగాని హామీలు

ABN, First Publish Date - 2023-09-22T03:04:46+05:30

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు అలవిగాని హమీలిచ్చి ప్రజలను మోసం చేస్తున్నాయని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు,

ప్రభుత్వ భూములమ్మి రుణమాఫీ చేస్తున్నారు: ఈటల

హైదరాబాద్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు అలవిగాని హమీలిచ్చి ప్రజలను మోసం చేస్తున్నాయని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి, 57 ఏళ్లకు పెన్షన్‌తో పాటు వితంతు పెన్షన్‌ను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈటల విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అవడం వల్లే కేసీఆర్‌ తన హామీలను నెరవేర్చలేక పోతున్నారని అన్నారు. గతంలో ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకుంటే పెన్షన్‌ వచ్చేదని, ఇప్పుడు కేసీఆర్‌ ఓకే చెప్తేనే పెన్షన్‌ వచ్చే పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోకాపేట, రింగురోడ్డు వద్ద ప్రభుత్వ భూములు విక్రయించడం, మద్యం దుకాణాల టెండర్‌ల ద్వారా వచ్చిన ఆదాయంతో ప్రభుత్వం రుణమాఫీ చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ఖజానా దివాళా తీసిందంటూ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు తామిచ్చే హామీలను ఎలా అమలు చేస్తారో చెప్పాలని ఈటల డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-09-22T03:04:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising