ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TPCC President Revanth Reddy : బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే

ABN, First Publish Date - 2023-03-02T02:47:52+05:30

అంగీలు, జెండాలు మారినా బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు రెండూ ఒక్కటేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మిషన్‌ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో అవినీతి జరుగుతుంటే బీజేపీ నాయకులు కేంద్రానికి కేసీఆర్‌పై ఒక్క ఫిర్యాదు కూడా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కేసీఆర్‌ అవినీతిపై బీజేపీ నేతలు కేంద్రానికి ఫిర్యాదు చేయరెందుకు?

ఇసుక మాఫియాలో కేసీఆర్‌ కుటుంబం

తెలంగాణ ఉద్యమంలో సంజయ్‌, కిషన్‌రెడ్డి, అర్వింద్‌ ఎక్కడున్నారు?

హాత్‌ సే హాత్‌ జోడో యాత్రలో రేవంత్‌

హుజూరాబాద్‌/జమ్మికుంట, మార్చి 1: అంగీలు, జెండాలు మారినా బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు రెండూ ఒక్కటేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మిషన్‌ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో అవినీతి జరుగుతుంటే బీజేపీ నాయకులు కేంద్రానికి కేసీఆర్‌పై ఒక్క ఫిర్యాదు కూడా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ అవినీతిపై విచారణకు ఆదేశించాలని కేంద్ర మంత్రి అమిత్‌షాను ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌.. ఎందుకు అడగలేదని నిలదీశారు. కేసీఆర్‌ అవినీతిపై కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే కొట్లాడుతుందన్నారు. హాత్‌ సే హాత్‌ జోడో యాత్రలో భాగంగా బుధవారం రాత్రి హుజూరాబాద్‌ అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్నర్‌ సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో బలహీనవర్గాలు బాగుపడాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను నెరవేరుస్తామని కరీంనగర్‌ గడ్డలో సోనియాగాంధీ మాట ఇచ్చి ఆంధ్రలో కాంగ్రెస్‌ పార్టీ నష్టపోయినాప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందని తెలిపారు. కేంద్ర మంత్రి అమిత్‌షా ఢిల్లీకి రాష్ట్రంలోని బీజేపీ నాయకులను పిలుపించుకుంటే.. రాష్ట్రంలోని సమస్యలు పరిష్కరిస్తారని అనుకున్నానని, కానీ.. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాలని కేంద్ర మంత్రి చెప్పిపంపడం సిగ్గుచేటని అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ ఎంపీలు బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి, అర్వింద్‌ ఎక్కడున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని రైతులకు బీఆర్‌ఎస్‌ నేతలు 24గంటల కరెంటు ఇస్తున్నామని గొప్పలు చెబుతున్నారని, దానిని నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో తాము ఓట్లు అడగబోమని సవాల్‌ విసిరారు. 2024 జనవరి 1న కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.500, రూ.2 లక్షల రైతు రుణమాఫీ, 2లక్షల ఉద్యోగాల భర్తీ, రూ.5 లక్షల ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు పథకానికి రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించారు.

ప్రైవేట్‌ సామ్రాజ్యాల్లా ఇసుక క్వారీలు..

రాష్ట్రంలో ల్యాండ్‌, సాండ్‌, వైన్‌, మైన్‌ మాఫియా బీఆర్‌ఎస్‌ నేతల కనుసన్నల్లో నడుస్తోందని, ఇసుక క్వారీలన్నీ ప్రైవేట్‌ సామ్రాజ్యాలను తలపిస్తున్నాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇసుక మాఫియాలో కేసీఆర్‌ కుటుంబానికి ప్రత్యక్ష భాగస్వామ్యం ఉందన్నారు. ఎంపీ సంతో్‌షరావు, ఆయన తండ్రి రవీందర్‌రావు మానేరు ఇసుకను కొల్లగొట్టారని అన్నారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలంలోని తనుగుల ఇసుక క్వారీని రేవంత్‌పరిశీలించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నేతలు మాఫియాగా మారి వేల కోట్లు కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. వాళ్ల అక్రమ పనులకు అడ్డం వచ్చిన వారిని అంతమొందిస్తున్నారని ఆరోపించారు. ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కాంగ్రెస్‌ తరఫున పోరాడతామని తెలిపారు.

రేవంత్‌పై దాడి అప్రజాస్వామికం: భట్టి

హైదరాబాద్‌ు రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడులకు పాల్పడడం అప్రజాస్వామికమని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి తన అభిప్రాయాలను ేస్వచ్ఛగా వెల్లడించే హక్కు ఉంటుందన్నారు. దాడులకు పాల్పడ్డ వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-03-02T02:49:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!