ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేములవాడలో భక్తజన జాతర

ABN, First Publish Date - 2023-02-07T01:09:05+05:30

ప్రముఖ పుణ్యక్షేత్రం రాజన్న సిరిసిల్లలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర దేవస్థానం సోమవారం భక్తజనంతో జాతరను తలపించింది. మహాశివరాత్రి సమీపిస్తున్న తరుణంలో వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, పట్టణ వీధులు కిక్కిరిసిపోయాయి.

వేములవాడ రాజన్న ఆలయం వద్ద భక్తుల రద్దీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేములవాడ, ఫిబ్రవరి 6 : ప్రముఖ పుణ్యక్షేత్రం రాజన్న సిరిసిల్లలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర దేవస్థానం సోమవారం భక్తజనంతో జాతరను తలపించింది. మహాశివరాత్రి సమీపిస్తున్న తరుణంలో వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, పట్టణ వీధులు కిక్కిరిసిపోయాయి. భక్తులు రుద్రాభిషేకం, అన్నపూజ, శ్రీస్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం, కుంకుమపూజ తదితర ఆర్జిత సేవలలో పాల్గొనడంతో పాటు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. సోమవారం సందర్భంగా భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో దర్శనం కోసం మూడు గంటలకు పైగా సమయం పట్టింది. కోడెమొక్కు చెల్లింపు కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. సుమారు 20 వేలకు పైగా భక్తులు శ్రీస్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల వాహనాలతో గుడి చెరువు మైదానం నిండిపోయింది. అనుబంధ బద్దిపోచమ్మ ఆలయంలోనూ భక్తుల రద్దీ కొనసాగింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కు సమర్పించారు. ఈవో కృష్ణప్రసాద్‌ నేతృత్వంలో ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2023-02-07T01:09:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising