బత్తాయి రైతు బేజార్
ABN, First Publish Date - 2023-04-03T00:32:40+05:30
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్దంన్నర కాలం కిత్రం బత్తాయి సాగులో నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉండేది. కాల క్రమేణా విస్తీర్ణం తగ్గు తూ వచ్చింది. ప్రధానంగా వాతావరణ మార్పు లు, నాసిరకం మొక్కలు, రసాయనిక ఎరువుల ధరలు, కూలీల రేట్లు భారీగా పెరగడంతో పాటు తెగుళ్ల వ్యాప్తితో తోటలు అంతరించి పో తున్నాయి. స్థానికంగా మార్కెటింగ్ వసతులు లేకపోవడం, బత్తాయి సాగును ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తోటలకు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి.
వాతావరణ మార్పుతో పెరిగిన తెగుళ్లు
దిగుబడులపై ప్రభావం
రైతుల ఆందోళన
త్రిపురారం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్దంన్నర కాలం కిత్రం బత్తాయి సాగులో నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉండేది. కాల క్రమేణా విస్తీర్ణం తగ్గు తూ వచ్చింది. ప్రధానంగా వాతావరణ మార్పు లు, నాసిరకం మొక్కలు, రసాయనిక ఎరువుల ధరలు, కూలీల రేట్లు భారీగా పెరగడంతో పాటు తెగుళ్ల వ్యాప్తితో తోటలు అంతరించి పో తున్నాయి. స్థానికంగా మార్కెటింగ్ వసతులు లేకపోవడం, బత్తాయి సాగును ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తోటలకు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో ఉమ్మడి జిల్లాలో 2.50లక్షల ఎకరాల్లో బత్తాయి సాగవ్వగా, ప్రస్తుతం 54వేల ఎకరాలకే పరిమితమైంది.
వాతావరణంలో రెండు దశాబ్దాలుగా పలు మార్పులు చోటుచేసుకున్నాయి. వర్షాలతో పాటు గాలిలో తేమ శాతం పెరగడంతో బత్తాయిలో తెగు ళ్ల వ్యాప్తి అధికమైంది. మంగునల్లితో కాయలు నల్లరంగులో మారి రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి. ఈ ఏడాది ప్రతీ తోటలో బత్తాయికి మంగు వ్యాప్తి అధికమైంది. ఎన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టినా ఫలి తం లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నా రు. వేరుకుళ్లుతో చెట్లు ఎండిపోతుండటంతో తోటలు వేగంగా అంతరించిపోతున్నాయి. ఆకుల్లో రసం పీల్చే నల్లి జాతితో తోటలు పసుపు రంగులోకి మా రి దిగుబడులుపై తీవ్ర ప్రభావం చూపుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది దిగుబడులే లేవు
బత్తాయిలో కత్తెర కాపు రావాలంటే సెప్టెంబరు, అక్టోబరు నెలలో తోటలు వాడుపెట్టి (బహర్ పద్ధ తి) నీరు కడితే పూత, పిందె వచ్చి వేసవిలో ఏప్రిల్, మే నెలలో కోతకు వస్తుంది. ఎకరానికి 2-3టన్నులు కత్తెర కాయ దిగుబడి వస్తుంది. అయితే ఈ ఏడాది వర్షాలు అధికంగా కురవడంతో చెట్ల వాడుకు సమ యం లేకుండా పోయింది. దీంతో ఆశించిన స్థాయి లో దిగుబడులు రాలేదని రైతులు చెబుతున్నారు. జనవరిలో పూతకు వచ్చినా పిందె పడినా వాతావర ణ మార్పులతో చాలా వరకు రాలిపోయిందని, ఎన్ని సస్యరక్షణ చర్యలు తీసుకున్నా ఫలితం లేదని రైతు లు పేర్కొంటున్నారు.ఆగస్టులో సీజన్ కాయ ఎకరానికి 5-6టన్నులు వస్తాయి. అయితే కనీసం ఎకరాని కి రెండు టన్నులు దిగుబడి కష్టం కావడంతో రైతు లు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.
పెట్టుబడుల గండం
బత్తాయిలో పెట్టుబడులు భారీగా పెరిగాయి. రసాయనిక, కాంప్లెక్స్, సేంద్రీయ ఎరువులు ధరలు 10 ఏళ్లలో 50శాతం మేర పెరిగాయి. గతంలో ఎకరానికి రూ.20-30వేల రూపాయల పెట్టుబడి వచ్చేది. ప్రస్తుతం రూ.50-60వేల వరకు ఎకరానికి పెట్టుబడులు అవుతున్నాయి. ఈ ఏడాది ఎకరానికి 4-5టన్నులు దిగుబడి వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో రైతులు నైరాశ్యంలో మునిగిపోయారు.
దళారుల దందా
బత్తాయి రైతులను మార్కెట్ సమస్య ప్రధానం గా వేధిస్తోంది. నల్లగొండలో ప్రభుత్వ ఆర్భాటంగా మార్కెట్ ఏర్పాటు చేసినా అది మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది. రవాణా, కూలీల చార్జీలు, మార్కెట్ కమీషన్ రైతులు చెల్లించాల్సి రావడంతో పాటు కాయకు సరైన ధర రాకపోవడంతో నష్టాలు చవిచూశారు. హైదరాబాద్ మార్కెట్ పరిస్థితి ఇదే విధంగా ఉండటంతో రైతులు చివరకు దళారులకు విక్రయిస్తున్నారు. దళారులు సిండికేట్‌గా ఇష్టం వచ్చిన ధరకు కొనుగోలుచేస్తున్నారు.
ప్రభుత్వ ఆదరణ కరువు
బత్తాయి రైతులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైంది. మొక్కలకు రాయితీలు ఇవ్వకపోవడంతో పాటు ఎటువంటి సబ్సిడీ పరికరాలు అందజేయడం లేదు. మార్కెట్ ధరలపై నియంత్రణ లేక రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. రెండు మండలాలకు ఒక ఉద్యానశాఖ అధికారి ఉన్నా రైతులకు ప్రయోజనం లేకుండాపోయింది. ప్రభుత్వం స్పందించకుం టే భవిష్యత్‌లో బత్తాయి అంతరించే పంటలో ప్రథమ స్థానంలో నిలిచే అవకాశం ఉంది.
ఈ ఏడాదీ నష్టమే : కరణం మల్లికార్జున్, రైతు, అనుముల
ఈ ఏడాది వర్షాలు అధికంగా కురవడంతో కత్తెర కాయ దిగుబడులు పడిపోయాయి. జనవరిలో సీజన్ పూత బాగా వచ్చినా పిందె దశలో వాతావరణ మార్పులు చోటుచేసుకోవడంతో పేను బంక, నల్లి వ్యాపించాయి. బఠాణి పరిమాణం ఉన్న కాయ చాలా వరకు రాలిపోయింది. చెట్ల ఆకులు పసుపు పచ్చగా మారాయి. చెట్టు వేరుకుళ్లుతో చనిపోతున్నాయి. తెగుళ్ల నివారణపై అధికారులు కనీస అవగాహన కల్పించడం లేదు. ఈ ఏడాది పెట్టుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం బత్తాయి రైతులను ఆదుకోవాలి.
Updated Date - 2023-04-03T00:32:40+05:30 IST