ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామాన్యులపై గుదిబండ

ABN, First Publish Date - 2023-03-02T00:47:00+05:30

మరోసారి కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌ ధర పెంచింది. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం పడనుంది. తరుచూ ధరలు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.14.2 కిలోల డొమెస్టిక్‌ ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌పై రూ. 50.19 పెంచగా కిలో కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.350.50కి చేరిం ది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గ్యాస్‌ సిలిండర్‌పై రూ.50.19 పెంపు

మరోసారి ధర పెంచిన కేంద్ర ప్రభుత్వం

పెరిగిన ధరలతో ఉమ్మడి జిల్లాలో రూ.5.28కోట్లకు పైగా భారం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి- నల్లగొండ, మోత్కూరు) : మరోసారి కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌ ధర పెంచింది. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం పడనుంది. తరుచూ ధరలు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.14.2 కిలోల డొమెస్టిక్‌ ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌పై రూ. 50.19 పెంచగా కిలో కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.350.50కి చేరిం ది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం జిల్లాలో డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ.1,155కు చేరుకుంది.

ఈ ఏడాది కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర లు పెరగడం ఇది రెండోసారి. ఇప్పటికే నిత్యావసర సరుకుల పెంపుతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తా జాగా డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర పెరగడం ప్రజలపై పెనుభారాన్ని వేసింది. వంట గ్యాస్‌ సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం రాయితీని ఎత్తివేస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వంట గ్యాస్‌ సి లిండర్‌పై రాయితీని తగ్గించుకుపోతూ పూర్తిగా ఎత్తివేశారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎలాంటి రాయితీ ఉండేది కాదు

2010 వరకు వంట గ్యాస్‌పై ఎలాంటి రాయితీ ఉండేది కాదు. ఆ తర్వాత సిలిండర్‌ ధర రూ.340 నుంచి ఒక్కసారిగా రూ.425కు పెంచారు. దీంతో కేంద్ర ప్రభుత్వం పెంచిన రూ.85ను రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించి అమలుచేసింది. క్రమక్రమంగా గ్యాస్‌ ధర పెరిగినప్పుడల్లా స్టాండర్డ్‌ రేట్లను నిర్ణయించుకుని మిగతా సొమ్మును ప్రభుత్వం వినియోగదారులకు రాయితీలు ఇస్తూ వస్తోంది. కొవిడ్‌ సమయంలో రెండున్నరేళ్లకు పైగా వంట గ్యాస్‌పై ఇచ్చే రాయితీని క్రమంగా తగ్గిస్తూ వచ్చారు. గతంలో ఉజ్వల పథకం సిలిండర్లకు రాయితీ ఇస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉజ్వల సిలిండర్ల పై ఉన్న రాయితీని తీసేస్తూ ఆ సిలిండర్లపై కూ డా భారాన్ని వేసింది. ఉజ్వల పథకం ద్వా రా సిలిండర్లు వాడుతున్న వారి పరిస్థి తి కూడా ఇబ్బందికరంగా తయారైంది. పెరుగుతున్న ధరలతో సామాన్యుడు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది.

ఉమ్మడి జిల్లాలో 10.56లక్షలకు పైగా కనెక్షన్లు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గ్యాస్‌ కనెక్షన్ల కుటుంబాలు 10,56,496 ఉన్నాయి. వీటిలో ఉజ్వల పథకం కింద 1,25,514 కాగా దీపం పథకం కింద 2,04,024 కనెక్షన్లు ఉండగా సాధారణ కనెక్షన్లు 7,26,958 ఉన్నాయి. ఈసారి పెంచిన ధరలతో ఉజ్వల కనెక్షన్ల కుటుంబాలపై కూడా ఒక్కో కనెక్షన్‌పై రూ.50 అదనపు భారం పడుతోంది. పెరిగిన ధరలతో నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లోని 10,56,496 కనెక్షన్లకు సంబంధించి వినియోగదారులపై రూ.5,28,24,800 భారం అదనంగా పడుతోంది. గతంలో ఉజ్వల సిలిండర్లకు సంబంధించి రాయితీ రూ.200 ఉండేది. ప్రస్తుతం రూ.50 పెంచి వారిపై కూడా భారం వేశారు.

నేడు, రేపు నిరసనలు : మంత్రి జగదీష్‌రెడ్డి

నల్లగొండ: గ్యాస్‌ ధరల పెంపు ను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వ ర్యం లో నేడు, రేపు నిరసన కార్యక్రమా లు చేపట్టనున్నట్లు మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. 2న మండల కేంద్రాల్లో, 3న నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ధర్నా కార్య క్రమాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

పెంచిన ధరలు తగ్గించాలి : తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి, మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌, మోత్కూరు

కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెంచుకుంటూ పోతుండటంతో పేద కుటుంబాల వారు కొనలేకపోతున్నారు. గృహ వినియోగ సిలిండర్‌ ధర డోర్‌ డెలివరీ చార్జీలతో కలిపి ఇప్పటికే రూ.1150 ఉండగా ఇప్పుడు రూ.1200కు పెరిగింది. రైతులు, కూలీలు, కార్మికుల ఆదాయాలు పెరగలేదు. సిలిండర్‌ ధర పెంచడంతో వారు సిలిండర్‌కొనలేక మళ్లీ కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిలిండర్‌ ధర పెంచడం మహిళలపై మరింత భారం మోపడమే. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన ధర తగ్గించాలి.

ఉమ్మడి జిల్లాలో వంట గ్యాస్‌ కనెక్షన్ల వివరాలు

జిల్లా ఉజ్వల దీపం సాధారణ

నల్లగొండ 68,295 99,537 3,16,268

సూర్యాపేట 44,322 55,537 2,66,515

యాదాద్రి 12,897 48,950 1,44,175

మొత్తం 1,25,514 2,04,024 7,26,958

Updated Date - 2023-03-02T00:47:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!