ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అసెంబ్లీ ఎన్నికల్లో కలిసే పోటీ

ABN, First Publish Date - 2023-09-22T03:05:33+05:30

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు.

1న సీట్లపై నిర్ణయం: సీపీఐ, సీపీఎం

హైదరాబాద్‌, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. సీట్లపై చర్చించి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని అన్నారు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో గురువారం సీపీఐ, సీపీఎం నాయకుల ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కూనంనేని మీడియాతో మాట్లాడారు. అక్టోబరు 1న మరోసారి ఇరు పార్టీల భేటీ ఉంటుందని, కలిసి పోటీ చేసే స్థానాలను ఆ రోజు ప్రకటిస్తామని వెల్లడించారు. ఉమ్మడి సమావేశంలో కాంగ్రె్‌సతో పొత్తు అంశం చర్చకు రాలేదని తెలిపారు. కాంగ్రె్‌సతో పొత్తు వద్దనుకోవడం లేదని అన్నారు. అంగన్‌వాడీపై పోలీసుల దాడిని ఖండించారు. మహిళా బిల్లు వెంటనే అమల్లోకి వచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. బిల్లులో ఓబీసీ కోటా ఉండాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-09-22T03:06:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising