ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జైలుకు పంపితే ఆత్మహత్య చేసుకుంటా..

ABN, First Publish Date - 2023-06-11T03:17:27+05:30

హైదరాబాద్‌లో సంచలనం రేపిన అప్సర హత్య కేసు నిందితుడు సాయికృష్ణకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో పోలీసులు అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే అంతకుముందు పోలీసుస్టేషన్‌లో జైలుకు పంపిస్తే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అప్సర హత్య కేసు నిందితుడు సాయికృష్ణ

పోలీసు స్టేషన్‌లో ఏడుస్తూ హల్‌చల్‌..

హైదరాబాద్‌ సిటీ/దిల్‌సుఖ్‌నగర్‌/శంషాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో సంచలనం రేపిన అప్సర హత్య కేసు నిందితుడు సాయికృష్ణకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో పోలీసులు అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే అంతకుముందు పోలీసుస్టేషన్‌లో జైలుకు పంపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని సాయికృష్ణ ఏడుస్తూ హల్‌చల్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు పేర్కొన్నారు. పథకం ప్రకారమే అప్సరను సాయికృష్ణ హత్య చేసినట్లు వెల్లడించారు. హత్యకు వారం రోజుల ముందుగానే ఎలా హత్య చేయాలి..? సాక్ష్యాధారాలను ఎలా మాయం చేయాలి..? శవాన్ని ఎక్కడ పడేయాలి..? అనే విషయాలను గూగుల్‌లో వెతికినట్లు గుర్తించారు. ‘‘సరూర్‌నగర్‌ బంగారు మైసమ్మ ఆలయంలోనే గత ఏడాది ఏప్రిల్‌లో సాయికృష్ణ, అప్సర మధ్య పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల్లోనే గంటల కొద్ది ఫోన్లు మాట్లాడుకోవడం, వాట్సాప్‌లో ప్రేమ కబుర్లు, చాటింగ్‌లు మామూలైపోయాయి. గత ఏడాది నవంబరులో సాయికృష్ణ, అప్సర కొద్దిమంది స్నేహితులతో కలిసి గుజరాత్‌ విహారయాత్రకు వెళ్లారు. ఈక్రమంలోనే ఇద్దరి మధ్య మరింత చనువు పెరిగి శారీరక సంబంధానికి దారితీసింది. అలా ఇద్దరూ ఒక్కటవడంతో తనను పెళ్లి చేసుకోవాలని అప్సర కోరింది. అయితే సాయికృష్ణ ఎప్పటికప్పుడు పెళ్లి విషయాన్ని దూరం పెడుతూ వచ్చాడు. ఈ ఏడాది మార్చి నుంచి అప్సర ఒత్తిడి పెంచింది. పెళ్లి చేసుకోకపోతే పరువు తీస్తాన ని హెచ్చరించింది. అప్పటికే పెళ్లయి ఓ కూతురున్న సాయికృష్ణ అప్సరను పెళ్లి చేసుకుంటే సమాజంలో తన పరువు పోతుందని భావించాడు. ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఇందుకు పథకం రచించాడు. హత్యకు వారం రోజుల ముందే గూగుల్‌, యూట్యూబ్‌లో హత్యలకు సంబంధించిన వీడియోలు చూసి అవగాహన పెంచుకున్నాడు. పథకం ప్రకారం కోయంబత్తూరుకు వెళ్దామని చెప్పి ఈ నెల 3న అప్సరను రాత్రి 8 గంటల సమయంలో బయటకు తీసుకెళ్లాడు. ఏవో కారణాలు చెప్పి ఆమెను అర్ధరాత్రి శంషాబాద్‌ సమీపంలోని సుల్తాన్‌పల్లి గోశాలకు తీసుకెళ్లాడు. అక్కడ అప్సర నిద్రలోకి జారుకున్నాక 4వ తేదీన తెల్లవారుజామున 3:30కి ఆమెను హత్య చేశాడు.’’ అని రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - 2023-06-11T03:17:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising