కొనుగోలు కేంద్రాలేవీ?
ABN, First Publish Date - 2023-04-03T00:21:03+05:30
వరి కోతలు ప్రారంభమయ్యే నాటికి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేసి, సగం మంది రైతులు పంట విక్రయించాక ఏర్పాటు చేయడం రివాజుగా మారింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వరి కోసిన రైతులు ధాన్యాన్ని ప్రైవేటు వ్యా పారులకు విక్రయించి నష్టపోతున్నారు.
యాసంగి వరి కోతలు షురూ
కేంద్రాల ఏర్పాటులో జాప్యం
ఈ నెల 15 నుంచి ప్రారంభిస్తామంటున్న అధికారులు
ఇంకా ఖరారుకాని కొనుగోలు కేంద్రాలు, మిల్లుల కేటాయింపు
ఇతడి పేరు వైట్ల బాలకృష్ణ. నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రానికి చెందిన కౌలు రైతు. నాలుగు ఎక రాల్లో ఎంటీయు-1010 దొడ్డు రకం సాగు చేశాడు. వాతావరణం సరిగా లేక పోవడంతో ధాన్యం చేతి కొస్తుందో రాదో అనే భయంతో 12రోజుల క్రితమే పొలం కోశాడు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు లేకపోవడంతో మిల్లుల వద్దకు తీసుకువెళ్లగా క్వింటాకు రూ.1650 ధర చెప్పారు. చేసేది లేక కల్లంలోనే ధా న్యం ఆరబోశారు. రోజూ కుప్ప చేయడం, మళ్లీ ఆరబెట్ట డం నిత్యకృత్యంగా మారింది. రేయింబవళ్లు ధాన్యం వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయక పోవడంతో దొడ్డు రకం సాగు చేసిన ప్రతీ రైతు ఇలాగే ఇబ్బందులు పడుతున్నారు.
మోత్కూరు, త్రిపురారం: వరి కోతలు ప్రారంభమయ్యే నాటికి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేసి, సగం మంది రైతులు పంట విక్రయించాక ఏర్పాటు చేయడం రివాజుగా మారింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వరి కోసిన రైతులు ధాన్యాన్ని ప్రైవేటు వ్యా పారులకు విక్రయించి నష్టపోతున్నారు. మార్చి చివ రి వారంలో వరి కోతలు ప్రారంభమవుతాయిని తెలిసినా, అధికారులు ఉద్దేశపూర్వకంగానే కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం యాసంగి సీజన్‌లో వరికోతలు ప్రారంభమయ్యాయి. మరి కొద్ది రోజుల్లో కోతలు సాగి ధాన్యం దిగుబడి రానుంది. అయినా నేటికీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు ధాన్యా న్ని తక్కువ ధరకు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఈ నెల 15 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని ఉన్నతాధికారులు ప్రకటించినా కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఏర్పాటుచేయాలనేది నేటికీ ఖరారు కాలేదు. అంతేగాక ధాన్యం కొనుగోలు చేసే ఐకేపీ, సింగిల్‌విండో సిబ్బందికి శిక్షణ ఇవ్వలేదు. ధాన్యం నాణ్యతా పరిశీలనకు ఏఈవోల నియామకం కూడా చేపట్టకపోవడం గమనార్హం.
వ్యాపారులకు విక్రయిస్తున్న రైతులు
గత వానాకాలం సీజన్‌లో వర్షాలు అధికంగా కురవడంతో చెరువు లు, కుంటలు నిండి, బావులు, బోర్లలో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో యాసంగి సీజన్‌లో రైతులు ఎక్కువగా వరి సాగు చేశారు. ప్రస్తుతం పంటలు కోతకు వచ్చాయి. ఈ తరుణంలో మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల, ఆత్మకూరు(ఎం) తదితర మండలాల్లో ఇటీవల కురిసిన వడగళ్లు, ఈదురు గాలులకు వరి నేలవాలి ధాన్యం రాలి రైతులు నష్టపోయారు. ఇప్పటికీ మబ్బులు కమ్ముకొస్తూనే ఉన్నాయి. ధాన్యం ఆరబెట్టేందుకు సరైన కల్లాలు లేవు. ధాన్యం రాశులపై కప్పేందుకు రైతుల వద్ద టార్పాలీన్లు సైతం లేవు. దీంతో వరి కోశాక వర్షం కురిస్తే ధాన్యం తడిసి ఆగమవుతుందని రైతులు వెంటనే ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర ఏ-గ్రేడ్ ధాన్యానికి క్వింటా రూ.2060, సాధారణ రకం బీ-గ్రేడ్ ధాన్యానికి రూ.2040గా ఉంది. కాగా, ప్రైవేట్ వ్యాపారులు రూ.1650 నుంచి రూ.1750 వరకే రైతులకు చెల్లిస్తున్నారు. 60కిలోల ధాన్యం బస్తాకు రెండు కిలోలు కోత పెడుతున్నారు. హమాలీ, గుమస్తా, వేబ్రిడ్జి చార్జీలు, కమీషన్ పేరుతో ధాన్యంలో కోత పెడుతుండటంతో రైతులు నష్టపోతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 13.20లక్షల ఎకరాల్లో వరి సాగు
గత ఏడాది యాసంగిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 10.12లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ఈ ఏడాది యాసంగిలో 13.20లక్షల ఎకరాల్లో వరి సాగైంది. యాదాద్రి జిల్లాలో 2,89,312 ఎకరాలు, నల్లగొం డ జిల్లాలో 5,53,801, సూర్యాపేట జిల్లాలో 4,76,930 ఎకరాల్లో రైతు లు వరి సాగు చేశారు. ఏటా మార్చి చివరి వారంలో వరి కోతలు ప్రారంభమవుతాయి. అయితే ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం మా ర్చి చివరి వారంలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులం తా అక్కడే విక్రయించి మద్దతు ధర పొందే అవకాశం ఉంటుంది. కాగా, వరి కోతలు ప్రారంభమైనా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఖరారు చేయకపోవడం, సిబ్బందికి శిక్షణ ఇవ్వకపోవడం, తేమ, నా ణ్యతను పరిశీలించి రాశులను ఎంపిక చేసేందుకు నాణ్యతా పరిశీలకులను నియమంచకపోవడం, ధాన్యం రవాణాకు టెండర్లు ఖరారు చేయకపోవడం లాంటి ప్రక్రియ నేటికీ పూర్తికాలేదు. ఈ నెల 15వ తేదీన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నా, వాటి ప్రారంభం ఇంకా ఆలస్యమయ్యేలా ఉంది. దీంతో రైతులు ధాన్యాన్ని దళారులకు విక్రయించి నష్టపోతున్నారు. వెంటనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
నల్లగొండ జిల్లా త్రిపురారం మండలంలో సుమారు 28వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. 50శాతం మేర దొడ్డు రకమే సాగైంది. 12 రోజుల నుంచే కోతలు ప్రారంభమయ్యాయి. రైతులు కల్లాల్లోనే ధాన్యం ఆరబోశారు. ఈ నెల 21 తరువాత కొనుగోలు కేంద్రాల ప్రారంభమవుతాయని అధికారులు చెబుతుండగా, వాతావరణంలో మార్పులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం ఎక్కువగా ఆరితే గింజ ముక్కగా మారి బరువు తగ్గుతుందని, దీం తో మిల్లర్లు కొర్రీలు పెట్టి మద్దతు ఎగ్గొడతారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి కోతలు ప్రారంభం కావడంతో ధాన్యం నిల్వలు భారీగా పెరిగిపోతున్నాయి. ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే కేంద్రాల వద్ద ఒత్తిడి పెరిగి వివాదాలకు దారి తీసే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.
ప్రైవేట్ వ్యాపారికి విక్రయించా : బద్దం నాగార్జునరెడ్డి, రైతు, ఆరెగూడెం
యాసంగిలో 12 ఎకరాల్లో వరి సాగు చేశా. ఇటీవల కురిసిన వడగళ్లకు చేనులో కొంత ధాన్యం రాలింది. రెండు రోజుల క్రితం రెండు ఎకరాల్లో వరి కోశా. మిగతాది కోద్దామంటే పొలం దిగబడుతోంది. ఆరబెట్టకుండా ఎకరాకు 32క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రావాల్సి ఉండ గా, వడగళ్లకు ధాన్యం రాలిపోవడంతో ఎకరాకు 24క్వింటాళ్లే వచ్చాయి. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో కోసిన రెండెకరాల్లోని ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారికి విక్రయించా. మోత్కూరులో క్వింటా రూ.1650కు వ్యాపారి అడగ్గా, అనాజిపురం తీసుకెళ్లి రూ.1740కి విక్రయించా. వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నందున ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
కేంద్రాల ఏర్పాటు ఖరారు కాలేదు : వెంకటేశ్వర్లు, మోత్కూరు ఏపీఎం
మోత్కూరు మండలంలో ఏర్పాటు చేయాల్సి ధాన్యం కొనుగోలు కేంద్రాల విషయం ఇంకా ఖరారు కాలేదు. ధాన్యం కొనుగోలు చేసేందుకు ఐకేపీ సిబ్బందికి శిక్షణ సైతం ఇవ్వలేదు. ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.
Updated Date - 2023-04-03T00:21:03+05:30 IST