ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డబుల్‌బెడ్‌ రూంల పంపిణీపై విచారణ చేపట్టాలి

ABN, First Publish Date - 2023-03-05T01:01:03+05:30

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కేటాయింపులో అ వకతవకలు చోటు చేసుకున్నాయని దీనిపై మరోసారి విచారణ చేపట్టాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివా్‌సగౌడ్‌ డిమాండ్‌ చే శారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడతున్న శ్రీనివాస్‌గౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

డబుల్‌బెడ్‌ రూంల పంపిణీపై విచారణ చేపట్టాలి

రామగిరి, మార్చి 4: డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కేటాయింపులో అ వకతవకలు చోటు చేసుకున్నాయని దీనిపై మరోసారి విచారణ చేపట్టాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివా్‌సగౌడ్‌ డిమాండ్‌ చే శారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు, బీఆర్‌ఎస్‌ నాయకులు ఇళ్లలో కూర్చొని అర్హులను ఎంపిక చేసి జాబితాను తయారుచేశారని ఆరోపించారు. అర్హులను గుర్తించడంలో స్థా నిక ఎమ్మెల్యే, అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. పట్టణంలో ఇళ్లు లేని వారు 15వేల మంది ఉన్నట్లు బీజేపీ గుర్తిస్తే అధికారులు కేవలం 5వేల మంది ఉన్నట్లు గుర్తించారని విమర్శించా రు. అధికారులు గుర్తించిన అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఎ ప్పుడు ఇస్తారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. మురికి ప్రాం తాలు, గేటెడ్‌ కాలనీలు ఉన్న వార్డులను ఒకే తీరుగా చూడటం సరికాదన్నారు. ఇదిలా ఉంటే ఇళ్ల కేటాయింపులో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఇల్లు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారిని అధికారులు అర్హులుగా ప్రకటించి ఇళ్లు ఇచ్చారని ఆరోపించా రు. దీనిపై మరోసారి సమగ్ర విచారణ చేయాలని, అప్పటివరకు ప్ర స్తుతం విడుదల చేసిన జాబితాను నిలిపివేయాలని కోరారు. లే కుంటే సోమవారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపడుతామ ని ఆయన హెచ్చరించారు. సమావేశంలో మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ బండారు ప్రసాద్‌, పట్టణ అధ్యక్షుడు మొరిశెట్టి నాగేశ్వర్‌రావు, నా యకులు దాయం భూపాల్‌రెడ్డి, నూకల వెంకటనారాయణరెడ్డి, కొం డ భవానీప్రసాద్‌, చర్లపల్లి గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T01:01:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising