నేడే సంక్రాంతి
ABN, First Publish Date - 2023-01-15T01:23:26+05:30
తెలుగు ప్రజలు జరుపుకునే మూడు రోజుల ముచ్చటైన సంక్రాంతి పండగ శనివారం భోగిమంటలతో ఆరం భమైంది.
ముంగిళ్లన్నీ ముగ్గులతో ముస్తాబు
ఆకాశంలో గాలిపటాల రెపరెపలు
పిండివంటలన్నీ సిద్ధం
అలరిస్తున్న గంగిరెద్దులు
నిర్మల్ కల్చరల్, జనవరి 14 : తెలుగు ప్రజలు జరుపుకునే మూడు రోజుల ముచ్చటైన సంక్రాంతి పండగ శనివారం భోగిమంటలతో ఆరం భమైంది. పాఠశాలలకు సెలవులు కావడంతో ఇళ్లన్నీ పిల్లల సందడితో నెలకొన్నాయి. ఎటుచూసినా అందమైన రంగురంగుల రంగవల్లికలు, గొబ్బెమ్మలు దర్శనమిస్తూ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడుతు న్నాయి. జిల్లాకేంద్రంలోని అపార్ట్‌మెంట్‌లతో పాటు పలు గ్రామాలు, ప్రధానకూడళ్లలో ప్రజలు భోగిమంటలు కాచుకున్నారు. మూడు రోజులపండగకు స్వాగతం పలికారు. పిండి వంటలు, చకినాలు, అరిసెలు, బొబ్బట్లు తయారు చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. కుర్రకారు పతంగులు ఎగురవేస్తూ సందడి చేస్తున్నారు. యువత ఆటల పోటీలు ఏర్పాటు చేసుకుని సరదాగా గడిపేందుకు సన్నాహాలతో ఉన్నారు. ఆదివారం మకర సంక్రాంతి పండగ జరుపుకునేందుకు పట్టణాల నుంచి విద్యార్థులు, యువత, ఉద్యోగస్తులు తరలివచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలకు శనివారం నుంచి మూడురోజులు పాటు సంక్రాంతి సెలవులు రావడంతో గ్రామాలకు చేరుకొని సరదాగా పండగ జరుపుకునేందుకు ఉత్సాహం చూపి స్తున్నారు. గత రెండేళ్లుగా కరోనా మహ మ్మారితో కలువలేకపోయిన స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు ఈ పండగకు ఒక్కచోట కలుసు కొని సంతోషంగా గడప ను న్నారు. సూర్యుడు మకర సంక్రమణ వేళ మహిళలు నోములు నోచుకోనున్నారు. కనుము పండుగ రోజు మహిళలకు అత్యంత ప్రాధాన్యమైంది. ఆ రోజు నో ములు పంచుకుంటూ పసుపు కుంకుమలు ఒకరికొకరు అందజేసుకుంటారు. ప్రతీఒక్కరూ నువ్వులు బెల్లంతో తయారు చేసిన స్వీట్లు పంచుకుంటూ ఆయురారోగ్యాలు కలగాలని కోరు కుంటారు. చిన్నపిల్లలు, విద్యార్థులు, యువకులు మూడు రోజుల పాటు గాలిపటాలు ఎగురవేస్తూ ఉత్సాహంగా గడపనున్నారు. గంగిరెద్దుల వారు సంక్రాంతి దృష్ట్యా ఇంటింటికి తిరుగుతూ గంగిరెద్దులతో విన్యాసాలు చేయిస్తున్నారు. పండుగ కానుకలు ప్రజల నుంచి పొందనున్నారు. హరిదాసులు హరిలో రంగహరి అంటూ వీధుల్లో తిరుగుతూ, సంక్రాంతి పాటలు పాడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈసారి బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతీఒక్కరూ తమ ఇళ్ల ఎదుట కమలం ముగ్గులు వేసి అబ్బురపరుస్తున్నారు. రైతులు తమ పంటపొలాల వద్ద పశువులకు పూజలు చేసి పండిం చిన ధాన్యాన్ని ధాన్యరాసుల్లోకి చేరవేయనున్నారు. మూ డురోజులపాటు ఎలాంటి ఇతర కార్యక్రమాలు లేకుండా అందరూ సంక్రాంతి పండగ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేలా ప్రణాళికలు నిర్ణయించుకున్నారు. పండు గను ఆనందంగా చేసుకోవాలని రోడ్లపై పతం గులు ఎగురవేయవద్దని, స్తంభాలవద్ద జాగ్రతలు పాటించాలంటున్నారు.
Updated Date - 2023-01-15T01:23:27+05:30 IST