ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి

ABN, First Publish Date - 2023-06-03T00:58:29+05:30

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజ లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, త్యాగాలు ఒకరివి భోగాలు మరొకరివి అన్నట్లు పరిస్థితి ఉందని సీపీఐ ఎంఎల్‌ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి కే. రాజన్న అన్నారు

తహసీల్దార్‌ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఐ (ఎంఎల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ టౌన్‌, జూన్‌ 2 : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజ లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, త్యాగాలు ఒకరివి భోగాలు మరొకరివి అన్నట్లు పరిస్థితి ఉందని సీపీఐ ఎంఎల్‌ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి కే. రాజన్న అన్నారు. సీపీఐ ఎంఎల్‌ ప్రజాపంథా రాష్ట్ర మహాసభల పిలుపులో భాగంగా శుక్రవారం దీక్షాదివస్‌ నిరసన కార్యక్రమం నిర్మల్‌ తహ సీల్దార్‌ కార్యాలయం ముందు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్‌ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి కే. రాజన్న మాట్లాడుతూ... నీళ్లు, నిధులు నియా మకాల కోసం ఎందరో ప్రాణత్యాగాలు, పోరాటల ద్వారా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో త్యాగాలు ఒకరివి, భోగాలు మరొకరివి అన్నట్లు పరిస్థితి ఉంద న్నారు. ప్రతిపక్షాలు కనీసం ప్రగతిభవన్‌ మెట్లు ఎక్కే పరిస్థితి లేకుండా ఏక పక్షంగా పరిపాలన కొనసాగుతుందని ఆరోపించారు. ఆత్మగౌరవం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం సాధించుకున్న రాష్ట్రంలో ప్రజలకు అవి అందడం లేదని, అన్ని వర్గాల ఆశలు నిరాశలుగా మిగిలాయన్నారు. నిరుద్యోగుల ఆశ లు నెరవేరకపోగా అరకొర చేపట్టిన నియామక ప్రక్రియతో రాష్ట్రం అప్రతిష్ట పాలైందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దశాబ్ది సంబరాలు అధికారంలో ఉన్నవారికి తప్ప ప్రజలకు కాదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం పీవోడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కట్ల లక్ష్మి, ఏఐ పీకెఎస్‌ జిల్లా కార్యదర్శి మైముద్‌, మమతచ లక్ష్మి, ముంతాజ్‌, రేష్మ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:58:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising