సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి
ABN, First Publish Date - 2023-07-04T22:19:40+05:30
ఎన్‌హెచ్‌ఎం స్కీంలో పని చేస్తున్న సెకండ్ ఏఎన్‌ఎం సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ డిమాండ్ చేశారు.
ఆసిఫాబాద్, జూలై 4: ఎన్‌హెచ్‌ఎం స్కీంలో పని చేస్తున్న సెకండ్ ఏఎన్‌ఎం సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ అంజుంభానుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాల ఆరోగ్యాన్ని కాపాడుతూ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నా సెకండ్ ఏఎన్‌ఎంలను పట్టించుకోక పోవడం సరికాదని చెప్పారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 10, 11 తేదీల్లో సమ్మె చేస్తున్నటు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు దివాకర్, పుణ్యవతి, వసంత, రజిని, సునీత, శ్రీదేవి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-07-04T22:19:40+05:30 IST