ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం అలసత్వం

ABN, First Publish Date - 2023-07-21T22:50:42+05:30

ఉపాధ్యాయుల సమస్యల పరి ష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీ యూఎస్‌) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయింపు శ్రీనివాసరావు, బగ్గని రవికుమార్‌లు అన్నారు. శుక్రవారం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఉద్యమ కరపత్రాలు, పోస్టర్లను విడుదల చేశారు.

ఏసీసీ, జూలై 21: ఉపాధ్యాయుల సమస్యల పరి ష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీ యూఎస్‌) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయింపు శ్రీనివాసరావు, బగ్గని రవికుమార్‌లు అన్నారు. శుక్రవారం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఉద్యమ కరపత్రాలు, పోస్టర్లను విడుదల చేశారు. వారు మాట్లాడుతూ స్వరాష్ట్రం ఏర్పడితే ఉపాధ్యాయుల సమస్యలు తొలగిపో తాయని భావించామని, నేటి వరకు సమస్యలు పరిష్కారం కాలేదని ఆవే దన వ్యక్తం చేశారు. కనీసం బదిలీ లు, పదోన్నతులు చేపట్టలేదని విమ ర్శించారు. 317 జీవో ద్వారా ఉపాధ్యా యులకు అన్యాయం జరిగిందని అనేకసార్లు అధికారులు, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛన్‌ అమలు చేయాలని కోరినా పట్టించు కోలేదన్నారు. శనివారం ఉపాధ్యాయుల సంతకాల సేకరణ, 25న తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట నిరసన, 31న ఆర్డీవోలకు వినతి పత్రాలు, ఆగస్టు 5న కలెక్టరేట్‌ల ఎదుట ధర్నా, 19న హైద్రాబాద్‌ ఇందిరా పార్కు వద్దమహా ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. రమాదేవి, అశోక్‌, శ్రీధర్‌, నీలేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-07-21T22:50:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising