ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసిఫాబాద్‌ జిల్లా అభివృద్ధిలో అధికారుల కృషి అభినందనీయం

ABN, First Publish Date - 2023-01-05T23:15:27+05:30

ఆసిఫాబాద్‌, జనవరి 5: జిల్లా అభివృద్ధిలో అధికార యంత్రాంగం చేసిన కృషి అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో నూతనసంవత్సరంలోనూ అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. గురు వారం కలెక్టరేట్‌లో జిల్లా శాఖాధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌, జనవరి 5: జిల్లా అభివృద్ధిలో అధికార యంత్రాంగం చేసిన కృషి అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో నూతనసంవత్సరంలోనూ అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. గురు వారం కలెక్టరేట్‌లో జిల్లా శాఖాధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నూతన సంవత్స రంలో జిల్లాలో చేపట్టాల్సిన పనుల లక్ష్యాలను సాధిం చే విధంగా కృషిచేసి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుంచాలని అన్నారు. ఇంటర్మీడియట్‌ విద్యలో రాష్ట్రంలో 2వస్థానం, ఆరోగ్యంలో ప్రథమ స్థానం, స్వచ్ఛసర్వేక్షణ్‌, పారిశుధ్యంలో జిల్లా లోని కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ ఉత్తమ అవార్డు పొందడం చాలా సంతోషంగా ఉంద న్నారు. జిల్లాలో పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాఆస్పత్రిలో మొదటి సిజేరియన్‌ ప్రసవంచేయడంలో వైద్యఆరోగ్య శాఖ కృషి అభినందనీమన్నారు. జిల్లాలో పత్తి పంట మాత్రమే కాకుండా చిరుధాన్యాలు సాగుచేసే విధంగా రైతులను ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో విషజ్వరాల వ్యాప్తిని తగ్గించడంలో అధికారులు ప్రత్యేక దృష్టిసా రించడం సంతోషంగా ఉందన్నారు. మాతాశిశు మర ణాల శాతం చాలాతగ్గిందన్నారు. ఈశాతాన్ని సున్నా కు చేరేవిధంగా అధికారులుకృషి చేయాలన్నారు. సమీకృతకలెక్టరేట్‌ భవననిర్మాణాన్ని గడువులోగా పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్ధం చేయాలన్నారు. అనంతరం జిల్లా అధికారులకు జ్ఞాపికలను అందజేశారు.

Updated Date - 2023-01-05T23:15:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising