అట్టహాసంగా ప్రారంభమైన సీఎం కప్ క్రీడా పోటీలు
ABN, First Publish Date - 2023-05-22T22:47:55+05:30
తెలంగాణ రాష్ట్ర ఆవి ర్భావ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 22 నుంచి 24 వరకు నిర్వహించే జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సోమ వారం రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియం లో నిర్వహించిన పోటీలను కలెక్టర్ బాదావత్ సం తోష్, జడ్పీ చైర్‌పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మందమర్రి జీఎం మోహన్‌రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు.
రామకృష్ణాపూర్, మే 22: తెలంగాణ రాష్ట్ర ఆవి ర్భావ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 22 నుంచి 24 వరకు నిర్వహించే జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సోమ వారం రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియం లో నిర్వహించిన పోటీలను కలెక్టర్ బాదావత్ సం తోష్, జడ్పీ చైర్‌పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మందమర్రి జీఎం మోహన్‌రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. వివిధ మండలాల నుం చి వచ్చిన క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరిం చి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. వారు మాట్లా డుతూ క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో రాణించి మం చిర్యాల జిల్లాకు పేరు తీసుకురావాలని కోరారు. గెలుపు ఓటములు సహజమని, ఓడిన వారు నిరు త్సాహపడకుండా రాబోయే క్రీడలలో గెలుపునకు కృషి చేయాలన్నారు. వాలీబాల్ పోటీలను కలెక్టర్ సర్వీస్ చేసి ప్రారంభించారు. అదనపు కలెక్టర్ రాహుల్, మాజీ ఎమ్మెల్యే ఓదెలు, క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్మన్ విద్యాసాగర్‌రెడ్డి, డీవైఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, కబడ్డీ సెక్రెటరీ రాంచందర్, శ్రీరాంపూ ర్, మందమర్రి ఏరియా స్పోర్ట్స్ సూపర్‌వైజర్లు అశో క్, చిన్నయ్య, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, ఇన్‌చార్జి సమ్మయ్య, కౌన్సిలర్లు, సీఐ మ హేందర్‌రెడ్డి, ఎస్సై అశోక్, పీఈటీలు పాల్గొన్నారు.
Updated Date - 2023-05-22T22:47:55+05:30 IST