ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో వ్యవసాయ రంగం గణనీయమైన అభివృద్ధి

ABN, First Publish Date - 2023-06-07T22:37:40+05:30

మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయ రంగం గణనీయంగా అభివృద్ధి చెందిందని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు.

చెన్నూరులో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నూరు, జూన్‌ 7: మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయ రంగం గణనీయంగా అభివృద్ధి చెందిందని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయిరాం ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన నీటి పారుదల దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి చెన్నూరు నియోజకవర్గ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో తయారు చేసిన ప్రగతి నివేదికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా విప్‌ మాట్లాడుతూ గత పాలకులు సాగునీటి రంగాన్ని పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదంతో చెన్నూరు ఎత్తిపోతల పథకాన్ని సాధించుకున్నామన్నారు. చెన్నూరు లిప్ట్‌తో సాగునీటి రంగం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన మందమర్రి డీఈ శారదకు మెమోంటో తో పాటు ప్రశంసా పత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్‌, ఇరిగేషన్‌ సీఈ శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ స్వామి, డీఈలు వేణుగోపాల్‌, వెంకటస్వామి, ప్రవీణ్‌, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

ల్రక్షెట్టిపేట: రాష్ట్రంలోని ప్రాజెక్టులు, చెరువులు రివర్స్‌ పంపింగ్‌తో నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయని ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌ నేత అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాగునీటి దినోత్సవ సంబరాలను పట్టణంలోని ఎస్‌పీఆర్‌ గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సమాజంలోని సకల జనులకు సీఎం కేసీఆర్‌ సంక్షేమ ఫలాలను అందిస్తున్నా రన్నారు. ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టులతో మన రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాల సాగునీరు సాధ్యమైందన్నారు. అనంతరం ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ బీజేపీకి గతంలో మాదిరిగానే వందకు పైగా స్ధానాల్లో డిపాజిట్లు దక్కవని తెలిపారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ లింగయ్య, మున్సిపల్‌ చైర్మన్‌ కాంతయ్య, వైస్‌ చైర్మన్‌ పొడేటి శ్రీనివఆస్‌గౌడ్‌, పట్టణాద్యక్షుడు పాదం శ్రీనివాస్‌, మండలాధ్యక్షుడు చుంచు చిన్నయ్య,పార్టీ నాయకులు, కార్యకర్తలు, నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

బెల్లంపల్లిరూరల్‌: స్వరాష్ట్రంలో సాగునీటి కష్టాలు పూర్తిగా తొలగిపో యాయని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశా బ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం మండలంలోని కన్నాల గ్రామపంచాయతీ పరిధిలో గల ప్రైవేటు ఫంక్షన్‌హాలులో నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సాగునీటి దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ తొంగల సత్యనారాయణ, బెల్లంపల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నిరంజన్‌, జెడ్పీ సీఈవో నరేందర్‌, మున్సిపల్‌వైస్‌ చైర్మన్‌ సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T22:37:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising