ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కష్టపడి చదివితే మంచి ఫలితాలు

ABN, First Publish Date - 2023-03-05T01:13:06+05:30

విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధిస్తారని కలెక్టర్‌ కే.వరుణ్‌రెడ్డి అన్నారు.

విద్యార్థులతో కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నిర్మల్‌ కల్చరల్‌, మార్చి 4 : విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధిస్తారని కలెక్టర్‌ కే.వరుణ్‌రెడ్డి అన్నారు. శనివారం బీసీ సంక్షేమ హాస్టళ్లలో చదివే విద్యార్థులకు మోటివేషన్‌ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ... పది విద్యార్థులకు మార్కులు ఎంత ముఖ్యమో వివరిం చారు. బాగా చదవడతో తల్లిదండ్రుల కష్టాలు దూరం చేయగలుగుతామన్నారు. ఆత్మస్థైర్యాన్ని విడనాడరాదన్నారు. విషయ నిపుణులు విద్యార్థులను విజయం సాధించేలా ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్లు, పుస్తకాలు పంపిణీ చేశారు. బీసీ సంక్షేమ అధికారి లోకేష్‌, డీఈవో రవీందర్‌ రెడ్డి పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలపై అవగాహన

ప్రభుత్వ పథకాల అమలుపై కలెక్టర్‌ కే.వరుణ్‌రెడ్డి శనివారం తన కార్యాలయంలో అవగాహన కల్పించారు. అఖిల భారత సర్వీస్‌ అభ్యర్థులు ఐదురోజుల విలేజ్‌ విజిట్‌ కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై వివరించారు. జడ్పీ సీఈవో సుధీర్‌, డీఆర్డీవో విజయలక్ష్మి, ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. డంపింగ్‌యార్డు ఆకస్మిక తనిఖీ

డంపింగ్‌ యార్డును పరిశీలించిన కలెక్టర్‌

నిర్మల్‌ పట్టణంలోని బంగల్‌పేట్‌ సమీపంలోని డంపింగ్‌ యార్డును కలెక్టర్‌ కే. వరుణ్‌రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అభివృద్ధి పనులు పరిశీలించారు. పలు సూచనలు చేస్తూ చెత్త నుండి సంపద, తడి, పొడి చెత్తతో వర్మికంపోస్ట్‌, రీసైక్లింగ్‌ చేయడంపై దృష్టి సారించాలన్నారు. వాచ్‌మెన్‌ క్వార్టర్‌, వెయింగ్‌ బ్రిడ్జి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. డ్రై రిసార్ట్‌ సెంటర్‌ మార్పు లు చేయాలని సూచించారు. ఎమ్మార్వో సుభాష్‌ చందర్‌, డీఈ నాగేశ్వర్‌రావు, సానిటరీ ఇన్స్‌పెక్టర్‌ దేవిదాస్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-03-05T01:13:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising