ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రైల్వే ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మించాలి

ABN, First Publish Date - 2023-06-26T22:45:13+05:30

పట్టణంలోని హమాలీవాడ టూటౌన్‌ ప్రజల సౌకర్యార్ధం రైల్వే ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ డిమాండ్‌ చేశారు.

కరపత్రాలు అందజేస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏసీసీ, జూన్‌ 26: పట్టణంలోని హమాలీవాడ టూటౌన్‌ ప్రజల సౌకర్యార్ధం రైల్వే ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలో మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమంలో సోమవారం గడప గడపకు వెళ్లి మోదీ సాధించిన విజయాలను, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణంలోని హమాలీవాడ రైల్వేగేటు మూతపడడంతో పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వారి కోసం రైల్వే ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మించడానికి రైల్వే శాఖ సిద్ధంగా ఉందన్నారు. కాగా మంచిర్యాల మున్సిపాలిటీ సిద్ధంగా లేదని విమర్శించారు. ఇప్పటికైనా మున్సిపల్‌ పాలకవర్గం ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పురుషోత్తం, జాజు, హరికృష్ణ, ప్రభాకర్‌, శ్రీదేవి, మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కన్నెపల్లి: మండలంలోని ఎల్లారం, టేకులపల్లి గ్రామాల్లో బీజేపీ నాయకులు ప్రధాని మోడీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా బీజేపీ బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ మాట్లాడారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తామని రెండు సార్లు గద్దెనెక్కిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారిని మోసగించారని చెప్పారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ పోరాటాలు చేస్తుందన్నారు. ఎల్లారం, టేకులపల్లి గ్రామాల్లో రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. రాబో యే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్ధులను ఓడించాలని ఆయన పిలుపుని చ్చారు. కార్యక్రమంలో బీజేపీ మండల అద్యక్షుడు బేరె రామయ్య యాదవ్‌, జిల్లా కార్యదర్శి గోవర్ధన్‌, నాయకులు ప్రశాంత్‌, ప్రకాష్‌, శ్రావణ్‌కుమార్‌, నర్సింగ్‌, సత్యం, శంకర్‌, మహేందర్‌, నవీన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T22:45:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising