ప్రజారోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి
ABN, First Publish Date - 2023-06-11T22:51:21+05:30
ప్రజారోగ్యంపై వైద్యులు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించా లని రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ గడల శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫా బాద్ జిల్లాల డీఎంహెచ్‌వోలు, వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు.
మంచిర్యాల కలెక్టరేట్, జూన్ 11 : ప్రజారోగ్యంపై వైద్యులు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించా లని రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ గడల శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫా బాద్ జిల్లాల డీఎంహెచ్‌వోలు, వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. గడల శ్రీనివాస్ మాట్లాడు తూ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14న వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు. నియోజకవర్గాల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో గర్భిణు లకు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు న్యూట్రిషన్ కిట్‌లను పంపిణీ చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రోగ్యం కోసం ప్రవేశపెట్టిన పథకాలపై అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలన్నారు. ఆయా జిల్లాల్లో కేసీఆర్ కిట్‌లు, సాధారణ ప్రసవాలపై ప్రగతి నివేది కలను చదివి వినిపించాలన్నారు. రానున్న వర్షాకా లంలో సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించా లని, దోమలు ప్రబలకుండా చూడాలని ఆదేశించారు. దోమకాటు ద్వారా వచ్చే వ్యాధులపై అవగాహన శిబి రాలను ఏర్పాటు చేసి ఫీవర్ సర్వేలు చేపట్టాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులు, దీర్ఘకాలిక రోగుల కోసం ప్రత్యేక న్యూట్రిషన్ కిట్‌లను అందజేస్తుందని వాటిని క్షేత్రస్థాయిలో ప్రతీ ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా జిల్లాల్లోని ప్రజారో గ్యంపై ప్రత్యేక సమావేశాలు, అవగాహన సదస్సులు వారాంతంలో నిర్వహించాలన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో 9 ఏండ్లుగా అందించిన సంక్షేమ పథకాలు లబ్ధిదారుల వివరాలను ప్రజలకు చేరవయ్యేలా కార్యక్ర మాలు చేపట్టాలన్నారు. కేసీఆర్ కిట్‌లు, ప్రోత్సాహక నగదు, ఇతర సంక్షేమ పథకాలపై నివేదిక అందిం చాలన్నారు. రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు పాటించి ప్రజల ఆరో గ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దోమకాటు ద్వారా వచ్చే వ్యాధులపై అవగాహన శిబిరాలను ఏర్పా టు చేసి ఫీవర్ సర్వేలు చేపట్టాలన్నారు. కరోనా సమయంలో ప్రదర్శించిన స్ఫూర్తిని కొనసాగించాల న్నారు. కంటి వెలుగును విజయవంతంగా పూర్తి చేసి నందుకు అధికారులను అభినందించారు. సాధారణ ప్రసవాలను పెంచాలని, మెరుగైన వైద్య సదుపా యాలను అందించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం డీఎంహెచ్‌వోలు, సూపరింటెండెంట్‌లు గడల శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల డీఎంహెచ్‌వోలు సుబ్బారాయుడు, నరేందర్‌రాదోడ్, రామకృష్ణ, దన్‌రాజ్, సూపరింటెండెం ట్‌లు అరవింద్, హరిచందర్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి, నోడల్ అధికారులు, మెడికల్ అధికారులు నీరజ, ఫయాజ్ ఖాన్, విజయనిర్మల, వెంకటేశ్వర్లు, హరి పాల్గొన్నారు.
Updated Date - 2023-06-11T22:51:21+05:30 IST