ఆడపిల్లల రక్షణ అందరి బాధ్యత
ABN, First Publish Date - 2023-10-11T22:19:17+05:30
ఆడపిల్లల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మంచిర్యాల ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవ సాధికార సంస్థ కార్యదర్శి ఉదయ్‌కుమార్ అన్నారు.
ఏసీసీ, అక్టోబరు 11 : ఆడపిల్లల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మంచిర్యాల ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవ సాధికార సంస్థ కార్యదర్శి ఉదయ్‌కుమార్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని వనితా వాక్కు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవ్ గర్ల్ చైల్డ్ అనే నినాదంతో నిర్వహించిన 2కే రన్‌ను ఆయన బెల్లంపల్లి ఆర్డీవో కాసబోయిన సురేష్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి ఆడపిల్లల భద్రతకు భరోసా కల్పించాలన్నారు. బాలికల సాధికారత, లింగ అసమానతలను నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా 2012 నుంచి అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వనితావాక్కు ఫౌండర్ ప్రెసిడెంట్, అడ్వకేట్ రంగు వేణుకుమార్, కో ఫౌండర్స్ కవిత తాళ్లపల్లి, కుర్మ సునీత , గౌరవాధ్యక్షురాలు జ్యోత్స్నచంద్రదత్, అడ్వైజర్ డాక్టర్ అన్నపూర్ణ, కార్యదర్శులు చైతన్య,మంజుల, ఉపాద్యక్షుడు మంజుభాషిని, సభ్యులు రాచకొండ చందన, ధనలక్ష్మీ, పద్మ తదితరులు పాల్గొన్నారు. కాగా మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ చక్రపాణి ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఆడ పిల్లల హక్కులు , ఆరోగ్యం పట్ల శ్రద్ద, సమాజంలో బాలికలు నెరవేర్చాల్సిన బాద్యతల గురించి వివరించారు. కార్యక్రమంలో మహిళ సాధికారిత విభాగం తరుపున ప్రేమలత, కనకలక్ష్మీ, వైస్‌ప్రిన్సిపాల్‌పట్వర్దన్, అధ్యాపకులు కిశోర్‌కుమార్, శ్రీనివాస్, రామకృష్ష పాల్గొన్నారు.
Updated Date - 2023-10-11T22:19:17+05:30 IST