వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి
ABN, First Publish Date - 2023-06-26T22:43:17+05:30
వర్షాకాలం దృష్య్టా వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుబ్బరాయుడు అన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్, జూన్ 26 : వర్షాకాలం దృష్య్టా వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుబ్బరాయుడు అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సోమవారం వైద్యాధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీహెచ్‌సీ వారీగా ఎపిడమిక్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. ప్రభావిత గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. పరిసరాల పరిశుభ్రత, క్లోరినేషన్, శానిటేషన్ చేసేలా పంచాయతీ అధికారులు, కార్యదర్శులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని చెప్పారు. పిల్లలకు వంద శాతం టీకా వేయాలన్నారు. డయాబెటిస్, బీపీ మందులను సక్రమంగా అందించేందుకు చర్యలు తీసుకోవాని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయపూర్ణిమ, పీవో అనిత, ఫయాజ్‌ఖాన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-26T22:43:17+05:30 IST