ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

యోగాతో మానసిక ప్రశాంతత

ABN, First Publish Date - 2023-06-21T23:07:55+05:30

యోగాతో మానసిక ప్రశాంతత పొందవచ్చని డీఎంహెచ్‌వో సుబ్బారాయుడు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీ నుంచి ఐబీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాలేజీలో యోగాసనాలు వేశారు.

మంచిర్యాలలో ర్యాలీ నిర్వహిస్తున్న డీఎంహెచ్‌వో, విద్యార్థినులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల కలెక్టరేట్‌, జూన్‌ 21: యోగాతో మానసిక ప్రశాంతత పొందవచ్చని డీఎంహెచ్‌వో సుబ్బారాయుడు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీ నుంచి ఐబీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాలేజీలో యోగాసనాలు వేశారు. యోగా ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయనిర్మల, నర్సింగ్‌ కాలేజీ ఫ్రిన్సిపాల్‌ ఫాతిమా, వైస్‌ ప్రిన్సిపల్‌ సుజాత, డెమో వెంకటేశ్వర్లు, మేగన్‌, స్వామి, తదితరులు పాల్గొన్నారు.

ఏసీసీ: జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర పాఠశాల మైదానంలో వనితా వాక్కు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా వేడుకల్లో యోగా విద్యార్థులు, గురువులు వివిధ రకాల ఆసనాలు వేసి ఆకట్టుకున్నారు. మహిళలు జ్యోత్స్నచంద్రదత్‌ ఆద్వర్యంలో యోగా ప్రదర్శనలు ఇచ్చారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ డీపీఎం స్వర్ణలత, కవిత, సునీత, మంజుల , శైలజ తదితరులు పాల్గొన్నారు. పాత మంచిర్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పతాంజలి యోగా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెక్టోరియల్‌ అధికారి సత్యనారాయణ మూర్తి అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణరావు, స్పెషల్‌ ఆఫీసర్‌ సంతోష్‌, ఉపాధ్యాయులు చందు, పల్లవి, మంజుల, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో సీనియర్‌ సిటిజన్‌ వేముల వీరస్వామి యోగాసనాలు వేసి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌ వెంకటేష్‌, క్లబ్‌ అధ్యక్షుడు చంద్రమౌళి, సుధీర్‌, మధు , గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లి: పట్టణంలోని ఏఎంసీ క్రీడా మైదానంలో వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. తిలక్‌ స్టేడియంలో వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిలక్‌ స్టేడియం నుంచి కాంటా చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. సివిల్‌ కోర్టు ఆవరణలో జడ్జి న్యాయవాదులు యోగా చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సుదర్శన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, ప్రజలు పాల్గొన్నారు.

లక్షెట్టిపేట: పట్టణంలోని కోర్టు ఆవరణలో జూనియర్‌ సివిల్‌ జడ్జి మొహమ్మద్‌ అసదుల్లా షరీఫ్‌ ఆధ్వర్యంలో యోగా నిర్వహించారు. కార్యక్రమంలో జైలర్‌ స్వామి, పీపీ కారుకూరి సురేందర్‌, సూపరింటెండెంట్‌, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

భీమారం: మండల వ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. భీమారం సర్పంచు గద్దె రాంరెడ్డి, దాంపూర్‌ గ్రామ సర్పంచు సంతోషం భాస్కర్‌రెడ్డి, పోలంపల్లి సర్పంచు దర్శనాల రమేష్‌, ఎల్కేళ్వరం, కొత్తపల్లి, నర్సింగాపూర్‌, ఖాజీపల్లి, బూరుగుపల్లి, ధర్మారం , మద్దికల్‌ గ్రామాల సర్పంచులు ప్రజలతో కలిసి యోగా చేశారు.

కాసిపేట: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బుధవారం దేవాపూర్‌ ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీలో, కాసిపేట గనిపై ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ యూనిట్‌ హెడ్‌ ఎంపీ జోషి మాట్లాడుతూ యోగా చేయడం ద్వారా ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో మందమర్రి సీఐ మహేందర్‌రెడ్డి, దేవాపూర్‌ ఎస్‌ఐ ఆంజనేయులు, కాసిపేట గని గ్రూపు ఏజెంటు కుర్మ రాజేందర్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-06-21T23:07:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising