ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పశుమిత్రలకు కనీస వేతనం చెల్లించాలి

ABN, First Publish Date - 2023-06-26T22:47:23+05:30

పాడి పరిశ్రమ, పశుసంపద బాగోగులు చూసే పశుమిత్రలను వర్కర్లుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రాష్ట్ర పశుమిత్రుల వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో సోమవారం నస్పూర్‌లోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట ఒక్కరోజు దీక్ష చేపట్టారు.

కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేస్తున్న పశుమిత్ర వర్కర్‌ యూనియన్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నస్పూర్‌, జూన్‌ 26: పాడి పరిశ్రమ, పశుసంపద బాగోగులు చూసే పశుమిత్రలను వర్కర్లుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రాష్ట్ర పశుమిత్రుల వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో సోమవారం నస్పూర్‌లోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట ఒక్కరోజు దీక్ష చేపట్టారు. రాష్ట్రవ్యాప్తం గా జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఇక్కడ దీక్షకు కూర్చున్నట్లు నాయకులు చెప్పారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 150 మంది వరకు పశుమిత్రులు, పశుపోషనులకు, పశుసంవర్ధక శాఖకు మధ్య వారధిగా పనిచేస్తున్నారన్నారు. పశు మిత్రలకు పని భారం తగ్గించి వేతనం చెల్లించాలని కోరారు. గుర్తింపు కార్డులు ఇవ్వాలని, యూనిఫాం, గ్లౌజులు, మాస్కులు, మందులతో కూడిన కిట్‌ ఇవ్వాలన్నారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని, పని భద్రత, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. కృత్రిమ గర్భధారణ శిక్షణ పశు మిత్రలందరికీ ఇవ్వాలని, సబ్సిడీపై ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ బైకులను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు దుంపల రంజిత్‌ కుమార్‌, పశు మిత్ర సంఘం జిల్లా అధ్యక్షురాలు ఇరుకుల్ల శ్రీలత పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T22:47:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising