అంటు వ్యాధుల దడ
ABN, First Publish Date - 2023-07-25T23:34:10+05:30
ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలోని తాగునీటి వనరులన్నీ వరదనీటితో కలుషితమయ్యాయి. దీంతో ఏజెన్సీలో ప్రజానీకం అంటు వ్యాధుల భారినపడే ప్రమా దం పొంచి ఉందని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ఇప్పటికే పలువురు కళ్ల కలకతో ఇబ్బందులు పడుతున్నారు.
- అప్రమత్తంగా ఉండాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం
ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలోని తాగునీటి వనరులన్నీ వరదనీటితో కలుషితమయ్యాయి. దీంతో ఏజెన్సీలో ప్రజానీకం అంటు వ్యాధుల భారినపడే ప్రమా దం పొంచి ఉందని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ఇప్పటికే పలువురు కళ్ల కలకతో ఇబ్బందులు పడుతున్నారు.
(ఆంధ్రజ్యోతి-ఆసిఫాబాద్)
యేటా వర్షాకాల సీజన్‌లో నీటి సంబంధిత వ్యాధుల ని యంత్రణకు ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా డయేరియా, డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌తో ప్రజలు ఇ బ్బంది పడుతున్నారు. జిల్లాలో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు సంభవించి జిల్లా వ్యాప్త ంగా తాగునీటి వనరులన్నీ కలుషితమైపోయాయి. ఫలితంగా ప్రస్తుతం ఆ నీరు ఉపయోగించేందుకు వీల్లేకుండా ఉంది. దీంతో ప్రజలు నీటి సంబంధిత వ్యాధుల భారిన పడే అవకాశమందని నిపుణలు అందోళన వ్యక్తం చేస్తున్నారు..అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే స్పష్టం చేసిందని చెబుతున్నారు. దీంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించారు.
వరద ప్రభావిత ప్రాంతాలపై..
ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ క్రమంలోనే శనివారం కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలు అంటు వ్యాధుల భారిన పడకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మందుల కొరత రాకుండా చూడాలని జిల్లా అధికారులకు కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా గ్రా మీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిల్వ ఉండే చోట దోమలు వృద్ధి చెందే అవకాశమున్నందున చెత్తాచెదారం పేరుకుపోకుండా చూ డాలని కలెక్టర్ పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులను అరి కట్టేందుకు ప్రతీ శుక్రవారం డ్రై డే నిర్వహించాలని నిర్ణయించారు. అంటు వ్యాధుల ముప్పును నియంత్రించేందుకు వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ నియంత్రణ సాధ్యం కావడం లేదు. యేటా వర్షాకాలంలో డయేరియా, వైరల్ ఫీవర్, టైఫాయిడ్ వంటి అంటు వ్యాధులతో పాటు డెంగ్యూ, మలేరియా వంటి ప్రా ణాంతక జ్వరాలు కూడా ప్రబలడం ఇక్కడ సర్వసాధార ణంగా మారింది. మరీ ముఖ్యంగా కనుమరుగైపోయిందని భావించిన మలేరియా మహమ్మా రి మళ్లీ విజృంభిస్తున్నట్లు రాష్ట్ర వైధ్య, ఆరోగ్యశాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఆసిఫాబాద్ జిల్లాను మలేరియా సమస్యాత్మక ప్రాంతాల జాబితాలో చేర్చి నియంత్రణ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. తాజాగా కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలోని మారుమూల గ్రామాల్లో అసలే అంతంత మాత్రంగా ఉన్న రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో వైద్య సిబ్బంది మారుమూల ప్రాంతాలకు వెళ్లి సేవలు అందించడం సవాలేనని చెప్పక తప్పదు.
కళ్ల కలకతో జనం బెంబేలు..
వర్షాలు, వాతావరణంలో మారుమూల కారణంగా విప రీతంగా బయటికి వస్తున్న కీటకాలతో జిల్లావ్యాప్తంగా జ నం కంటి సంబంధ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నా రు. పదిహేను రోజులుగా కంటి ఇన్‌ఫెక్షన్లతో జిల్లా వ్యాప్తంగా రోగుల సంఖ్య పెరుగుతోంది. ప్రతిరోజు వందల సంఖ్యలో కంటి సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతూ పైవ్రేట్ వైద్యశాలలకు చికిత్స కోసం వెళుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఈ కంటి ఇన్‌ఫెక్షన్ల తీవ్రత అధికంగా ఉన్నట్లు గుర్తించారు. జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్ పట్టణంలోని దస్నాపూర్ గ్రామంలోనైతే కంటి ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతున్న వారి సంఖ్య 90 శాతానికి కు పైగా ఉందని చెబుతున్నారు. ఈ వ్యాధి బారిన పడిన వారికి కళ్లు ఎర్రబారడం, దురద, కంటి వెంట నీరు కార డం, మంట, వాపు, వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని బాఽ దితులు చెబుతున్నారు. ఇవన్నీ కూడా అలర్జీ కాన్జూక్టివి టీస్ వ్యాధి లక్షణాలని నిపుణులు చెబుతున్నారు. బ్యాక్టీరి యా కారణంగా ఇన్‌ఫెక్షన్ సోకుతోందని, వర్షాకాలంలోనే ఈ త రహా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయని చెబుతున్నారు. జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఎక్కడా కూ డా కంటి చికిత్సకు అవసరమైన సదుపాయాలు లేకపోవ డం వల్ల బాధితులు పైవ్రేట్ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. సీరియస్ కేసులను మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాలకు రెఫర్ చేస్తున్నట్లు చెబుతున్నారు. కాగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటివరకు ఈ వ్యాధి తీవ్రతపై దృష్టి సారించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు ఈ వ్యాధిపై కనీస అవగాహన కల్పించే ప్రయ త్నాలు కూడా చేయకపోవడం ఇక్కడి వైద్య ఆరోగ్యశాఖలో నెలకొన్న నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని చెబుతున్నారు.
Updated Date - 2023-07-25T23:34:10+05:30 IST