ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అట్రాసిటీ కేసుల్లో పరిహారం ఏదీ..?

ABN, First Publish Date - 2023-07-15T22:14:05+05:30

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ కేసులకు సంబంధించి ఫిర్యాదు దారులు కోర్టులకు హాజరయ్యేందుకు, ఇతరత్రా ఖర్చుల కోసం ప్రభుత్వపరంగా పరిహారం అందజేయాల్సి ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ కేసులకు సంబంధించి ఫిర్యాదు దారులు కోర్టులకు హాజరయ్యేందుకు, ఇతరత్రా ఖర్చుల కోసం ప్రభుత్వపరంగా పరిహారం అందజేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం 1989కు కేంద్ర ప్రభుత్వం 2016లో మరింత బలోపేతం చేసింది. ఈ చట్టం ప్రకారం బాధితులకు ప్రభుత్వపరంగా మూడు విడుతల్లో రూ. లక్ష వరకు పరిహారం కింద చెల్లించాల్సి ఉంటుంది. ఈ సొమ్మును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన వాటా కింద బాధితునికి అందజేయాలి. అట్రాసిటీ కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ (ఫస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌) నమోదైన వెంటనే రూ.25 శాతం, పోలీసులు కోర్టుల్లో చార్జ్‌షీట్‌ వేయగానే 50 శాతం, శిక్ష ఖరారైన తరువాత మరో 25 శాతం పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అయితే చాలా కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైన తరువాత 25 శాతం పరిహారం అందుతున్నప్పటికీ ఆ తరువాత చెల్లించాల్సిన వాయి దాలు అందడం లేదని బాధితులు వాపోతున్నారు. మరికొన్ని కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైనా పరిహారం చెల్లించడం లేదని తెలుస్తోంది. అట్రాసిటీ కేసులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తన వాటాను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పెండింగ్‌లో ఉంటున్నట్లు సమాచారం.

2016 నుంచి పెండింగ్‌

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పరిహారం చెల్లించేందుకు జిల్లా పరిధిలో కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పోలీస్‌ కమిష నర్‌, తదితరులు మెంబర్లుగా ఉంటారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయగానే నగదును కలెక్టర్‌ ద్వారా నేరుగా బాధితుల బ్యాంకు అకౌంట్లలో జమ చేయాల్సి ఉంటుంది. జిల్లాకు సంబంధించి 2016 నుంచి నమోదైన కేసుల్లో చాలా వాటికి ఇప్పటి వరకు పరిహారం చెల్లించలేదు. 2016 నుంచి 2023 వరకు జిల్లా వ్యాప్తంగా 523 కేసులు నమోదు కాగా వాటిలో ఇప్పటి వరకు 413 కేసుల్లో బాధితులకు పరిహారం అందజేశారు. మరో 71 మందికి సుమారు రూ.కోటి వరకు చెల్లించాల్సి ఉంది.

అరకొరగా చెల్లింపులు

అట్రాసిటి చట్టం ప్రకారం మూడు విడుతల్లో పూర్తి సొమ్ము చెల్లిం చాల్సి ఉండగా అనేక కేసుల్లో ఒక్క విడుతతోనే నిలిపివేసినట్లు తెలు స్తోంది. కోర్టుల్లో హియరింగ్‌ దశలో ఉన్న కేసుల్లో సైతం 25 శాతం వరకే చెల్లింపులు జరగడం గమనార్హం. పరిహారం చెల్లించనవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు......

-జిల్లా కేంధ్రంలోని గౌతమీనగర్‌కు చెందిన అజ్మీరా రాజేష్‌ నాయక్‌ తనను వేధించిన మల్లయ్య అనే వ్యక్తిపై ఫిర్యాదు చేయగా 2017లో ఎఫ్‌ఐఆర్‌ అయింది. క్రైం నెంబర్‌ 503/2017 ద్వారా అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాగానే బాధితునికి 25 శాతం కింద రూ. 25వేలు చెల్లించారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉంది. అయినా అతనికి మిగతా చెల్లింపులు జరగలేదు.

-దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన బొమ్మెల శంకరయ్య తన కూతురును ప్రేమ పేరుతో వంచించి, ఆమె మరణానికి కారణమైన మందమర్రికి చెందిన వంశీ అనే యువకునిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో 31-08-2021న అతనిపై 382/2021 కింద అట్రాసిటీ చట్టం ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అయితే రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు బాధితునికి నయా పైసా పరిహారం అందలేదు.

Updated Date - 2023-07-15T22:14:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising