ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముస్తాబైన హరిహర క్షేత్రం

ABN, First Publish Date - 2023-03-23T02:05:04+05:30

మండల కేంద్రంలోని శ్రీ హరిహర క్షేత్ర ఆలయం జాతరకు ముస్తాబైంది. ప్రతి సంవత్సరం ఉగాది తర్వాత రెండురోజులకు జాతరను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించ నున్నారు.

జాతరకు ముస్తాబైన హరిహర ఆలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మూడు రోజులపాటు కొనసాగుతున్న వివిధ కార్యక్రమాలు

పెంబి, మార్చి 22 : మండల కేంద్రంలోని శ్రీ హరిహర క్షేత్ర ఆలయం జాతరకు ముస్తాబైంది. ప్రతి సంవత్సరం ఉగాది తర్వాత రెండురోజులకు జాతరను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించ నున్నారు. హరిహర ఆలయ ఉత్సవాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. 24న శుక్రవారం అభిషేక ఆరాధనలు, స్వస్తి పుణ్యాహవా చనము, రక్షాబంధనము, అంకురారోపణము, బ్రహ్మ కరిశ స్థాపనము, అగ్నిప్రతిష్ట, యజ్ఞకార్యక్రమము, ధ్వజారోహణము, ఆలయ బలిహరణ ము, 25న శనివారం పుణ్యాహవాచనము, స్థాపిత దేవతా ఆరాధనలు, ఉత్సవ వరులకు స్నపన తిరు వంజనము, అభిషేకాలు, యజ్ఞ కార్యక్రమ ము, కుంకుమార్చన, ఆలయ బలిహరణము, తీర్థప్రసాద వితరణ, 26న ఆదివారం నిత్యనిధి ఆరాఽధన, కర్తణ పుణ్యాహవాచనము, గ్రామ బలి, పూర్ణాహుతి చూర్ణాభిషేకము, శ్రీ హరిహరుల కల్యాణ మహోత్సవం, అన్న ప్రసాద వితరణ, హరిహరుల పల్లకిసేవ, గ్రామ ప్రదక్షణము, ఆల య ప్రవేశము, జాతరను వెంకటేశ్వరాలయ యజ్ఞాచార్యులు చక్రపాణి నర సింహమూర్తి, చక్రపాణి వాసుదేవాచార్యులు, నరసింహచార్యులచే అంగ రంగ వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం కలదు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ, గ్రామప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2023-03-23T02:05:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising