ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాతృభాషను బతికించుకోవాలి

ABN, First Publish Date - 2023-02-21T22:15:48+05:30

మాట్లాడటం ద్వారా మాతృ భాషను బ్రతికించుకుందామని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సీవోఈ బెల్లంపల్లి ప్రిన్సిపాల్‌ ఐనాల సైదులు సూచించారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా గురుకులంలో లాంగ్వేజ్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బహుభాష కవి సమ్మేళనంలో విద్యార్ధులనుద్దేశించి మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెల్లంపల్లి రూరల్‌, ఫిబ్రవరి 21: మాట్లాడటం ద్వారా మాతృ భాషను బ్రతికించుకుందామని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సీవోఈ బెల్లంపల్లి ప్రిన్సిపాల్‌ ఐనాల సైదులు సూచించారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా గురుకులంలో లాంగ్వేజ్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బహుభాష కవి సమ్మేళనంలో విద్యార్ధులనుద్దేశించి మాట్లాడారు. భాషను ఉపయోగించినంత కాలం సజీవంగా వర్ధిల్లుతుందనీ, వాడుకలో లేని భాష క్రమంగా అంతరించి పోయే ప్రమాదముందన్నారు. అనంతరం నిర్వహించిన బహుభాషా కవిసమ్మేళనంలో తెలుగు, హిందీ, ఆంగ్లం, గోండి, మరాఠ మాతృ భాష లుగా కలిగిన విద్యార్థులు ఆయా మాతృభాషల్లో కవితాగానం చేశారు. వారి మాతృభాషలోని ప్రత్యేకతలను వివరించి ఆకట్టుకున్నారు. మాతృ భాషా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొం దిన విద్యార్థులకు, కవితాగానం చేసిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.

లాంగ్వేజ్‌ క్లబ్‌ అధ్యక్షుడు కోట రాజ్‌ కుమార్‌, జేవీపీ దాసం అజిత, సభ్యులు, ఉపాధ్యాయులు ప్రమోద్‌కుమార్‌, పి.రాజ్‌కుమార్‌, కొక్కుల రాజేష్‌, రమాదేవి అధ్యాపకులు మిట్టా రమేష్‌, రాజేష్‌, రఫి, రాజేందర్‌ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

దండేపల్లి: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని వెల్గనూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించారు. స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధిలోని 80 మంది విద్యార్థులకు లేఖరచన పోటీలను నిర్వహించారు. మాతృభాషాను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని కాంప్లెక్స్‌ హెచ్‌ఎం ఎల్‌. గాయత్రీ అన్నారు. పోటీలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

Updated Date - 2023-02-21T22:15:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising