ఆధ్యాత్మిక చింతనతో మానసిక వికాసం
ABN, First Publish Date - 2023-05-14T00:54:35+05:30
మానసిక వికాసానికి ఆధ్యాత్మిక చింతన ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
దిలావర్‌పూర్, మే 13 : మానసిక వికాసానికి ఆధ్యాత్మిక చింతన ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మండలంలోని కదిలిలో రూ.12 లక్షలతో నిర్మించిన శ్రీ భీమన్న దేవాలయాన్ని శనివారం మంత్రి అల్లోల ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... దేవాదాయశాఖ మంత్రిగా రాష్ట్రంలోని అనేక దేవాల యాల అభివృద్ధిలో పాలుపంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో దేవాదాయశాఖ మంత్రులుగా చేసిన ప్రతీ ఒక్కరూ ఎన్నికల్లో ఓటమి చవి చూశారని, కానీ తనను రెండు సార్లు గెలిపించి ఆ సెంటిమెంట్ నుంచి నన్ను మినహాయించి నిర్మల్ నియోజకవర్గ ప్రజలు విజయాన్ని అందించి సేవ చేసుకునే అవకాశం ఇచ్చారని అన్నారు. ప్రసిద్ధ కదిలి పాపహరేశ్వరాలయం, కాల్వ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల అభి వృద్ధికి కోట్లాది నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. కదిలిలో భక్తుల సౌకర్యం కోసం క్యాటేజీలు, గెస్ట్‌హౌస్‌లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేయడం నాకు తెలియదన్నారు. కొంత మంది కులం, మతం అంటూ ప్రజల్లో వైషమ్యాలు సృష్టిస్తున్నారని, అది భవిష్యత్ తరాలకు ఎంత మాత్రం మంచిది కాదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సరిత రాజు, ఉప సర్పంచ్ మారుతి పటేల్, కదిలి దేవస్థానం చైర్మన్ భుజంగ్ పటేల్, భీమన్న దేవాలయ కమిటీ చైర్మన్ టి.సాయినాథ్ తదితరులు పాల్గొ న్నారు.
స్టేట్ ర్యాంకర్లను సన్మానించిన మంత్రి
నిర్మల్ కల్చరల్ : ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్ర ర్యాంకులు సాధించిన ఎస్‌ఆర్ కళాశాల విద్యార్థినులను శనివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆయన నివాసంలో సన్మానించారు. వారిని అభినందిస్తూ భవిష్యత్తులో మరింత రాణించాలని ఆకాంక్షించారు. ఇంటర్ ప్రథమ సంవ త్సరంలో ఎంపీసీ విభాగం నుండి స్టేట్‌ఫస్ట్ ర్యాంకర్ శ్రేష్ఠను మంత్రి సన్మా నించారు. జిల్లా ర్యాంకులు సాధించిన కీర్తి, సంజన, అక్షయ, శ్వేత, సింఽధూజ, జే. శ్వేతలను మంత్రి అభినందించారు. ప్రిన్సిపాల్, సిబ్బంది పాల్గొన్నారు.
సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలని మంత్రికి వినతి
పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా 12 రకాల సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే. లక్ష్మి డిమాండ్ చేశారు. శనివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. నాణ్యమైన సన్నబియ్యం ఉచితంగా అందించాలని, వంట గ్యాస్‌పై సగం సబ్సిడీతో ఇవ్వాలని మంత్రి దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. గంగామణి, లత, శోభ, లలిత, తశ్రీన్ పాల్గొన్నారు.
Updated Date - 2023-05-14T00:54:35+05:30 IST