మాదకద్రవ్యాల నివారణకు చర్యలు చేపట్టాలి
ABN, First Publish Date - 2023-06-07T21:51:06+05:30
ఆసిఫాబాద్, జూన్ 7: జిల్లాలో మాదకద్రవ్యాల నివారణకు అధికా రులు కట్టుదిట్టమైన చర్యలు చేప ట్టాలని కలెక్టర్ హేమంత్ సహదేవ రావు అన్నారు. బుధవారం కలెక్టరే ట్‌లో ఎస్పీ సురేష్‌తో కలిసి అధికా రులు, మాదకద్రవ్యాల నివారణ కమిటీసభ్యులతో జిల్లాలో మాదక ద్రవ్యాల నివారణ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
- కలెక్టర్ హేమంత్ సహదేవరావు
ఆసిఫాబాద్, జూన్ 7: జిల్లాలో మాదకద్రవ్యాల నివారణకు అధికా రులు కట్టుదిట్టమైన చర్యలు చేప ట్టాలని కలెక్టర్ హేమంత్ సహదేవ రావు అన్నారు. బుధవారం కలెక్టరే ట్‌లో ఎస్పీ సురేష్‌తో కలిసి అధికా రులు, మాదకద్రవ్యాల నివారణ కమిటీసభ్యులతో జిల్లాలో మాదక ద్రవ్యాల నివారణ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సాగు, రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేయాలన్నారు. వీటివల్ల కలిగేనష్టాలను వివరిస్తూ పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. షార్ట్‌ఫిలింల ప్రదర్శనద్వారా అవగాహన కల్పించాలన్నా రు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, డీఎస్పీ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-07T22:07:20+05:30 IST