ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనఊరు - మనబడిలో ప్రజలను భాగస్వాములుగా చేయండి

ABN, First Publish Date - 2023-01-01T00:47:16+05:30

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మనబడి కార్యక్రమంలో ప్రజలను, విద్యార్థులను, దాతలను భాగ స్వాములుగా చేయాలని, ఒక్క ప్రభుత్వ బాధ్యతగా భావించరాదని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ కల్చరల్‌, డిసెంబరు 31 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మనబడి కార్యక్రమంలో ప్రజలను, విద్యార్థులను, దాతలను భాగ స్వాములుగా చేయాలని, ఒక్క ప్రభుత్వ బాధ్యతగా భావించరాదని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన సమీక్ష నిర్వహిం చారు. పేద విద్యార్థుల కోసం నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 82.03 కోట్ల అంచనాతో 260 పాఠశాలల్లో చేపట్టిన పనులు పూర్తి కావస్తున్నట్లు అధికారులు వివరించారు. పనులు వేగవంతం చేసి జనవరి 10 లోగా పూర్తికి మంత్రి ఆదేశించారు. కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ, డీఈవో రవీందర్‌రెడ్డి, ఇంజనీరింగ్‌ అధికారులు, ఎంఈవోలు పాల్గొన్నారు.

నిర్మల్‌ చైన్‌గేట్‌, డిసెంబరు 31 : విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకత, పరిశోఽ దనాసక్తిని వెలికితీసే లక్ష్యంతో సైన్స్‌ ఫెయిర్‌ నిర్వహణకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆదేశించారు. జనవరి 9, 10, 11 తేదీల్లో మూడు రోజులపాటు జిల్లా కేంద్రంలోని స్థానిక సెయింట్‌ ఽథామస్‌ హైస్కూల్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్‌ ఏర్పాట్లపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శనివారం కలెక్ట రేట్‌లో సమీక్ష నిర్వహించారు. ముందుగా రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి 516 మంది విద్యార్థులు, 280 మంది ఇన్స్‌స్పైర్‌ విజేతలతో పాటు గైడ్‌ టీచర్లు పాల్గొ ననున్నట్లు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రస్థాయి ప్రదర్శన కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి భారీసంఖ్యలో సందర్శ కులు వచ్చే అవకాశం ఉందని, దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు సమిష్టిగా పని చేసి ప్రదర్శనను విజయ వంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను చేయాలని సూచించారు. ఈ సమా వేశంలో కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, డీఈవో తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-01T00:47:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising