ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి

ABN, First Publish Date - 2023-02-19T00:55:50+05:30

జిల్లాలో మహాశివరాత్రి పర్వదినాన్ని శనివారం ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.

కదిలిలో పాప హరేశ్వరస్వామి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నదీ స్నానాలు, ఉపవాస దీక్షలు

కదిలికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు

ఓం నమఃశివాయఃతో మార్మోగిన పాపన్నలొద్ది

పాపహరేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రముఖులు

ఖానాపూర్‌ వద్ద ఉత్తరవాహినికి పోటెత్తిన భక్తజనం

నిర్మల్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 18 : జిల్లాలో మహాశివరాత్రి పర్వదినాన్ని శనివారం ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. శివాలయాలకు ఉదయం నుండి భక్తులు పోటెత్తారు. జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రంతో పాటు నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని బుధవార్‌పేట్‌ శివాలయం, హరిహరక్షేత్రం మల్లన్నగుట్ట, గండిరామన్న శివాలయం, వెంకట్రాదిపేట్‌ ఓంకారేశ్వర ఆలయం, బాగుల వాడలోని నగేశ్వర, బ్రహ్మపురి శివాలయం, నటరాజ్‌ నగర్‌ ఉమామహేశ్వర ఆలయంలో భక్తులు ఉదయం నుండే బారులు తీరి పూజలు చేశారు.

భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

జిల్లాలోని పరిసరాల్లో కొలువైన శివాలయాలు భక్తులతో కిటకిట లాడాయి. లక్ష్మణచాంద మండలం బాబాపూర్‌ రాజరాజేశ్వరస్వామి, మామ డ మండలంలోని బూరుగుపల్లి రాజరాజేశ్వరాలయం, కదిలి పాపహరేశ్వ రాలయం, నిర్మల్‌ మండలం సిద్దాపూర్‌ సిద్దేశ్వరాలయం, కాల్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు లోకేశ్వరంలోని బ్రహ్మేశ్వరాలయంలో జరిగిన శివరాత్రి ఉత్సవాల్లో భక్తులు పాల్గొని పూజలు జరిపారు. రాత్రి లింగోద్భవ సమయంలో శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. ఆల యాలు భక్తజన సందోహంతో నిండాయి.

గోదావరి నది పుణ్యస్నానాలు..ఉపవాస దీక్షలు..జాగరణ

జిల్లాలోని సోన్‌, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు, ఖానాపూర్‌లోని బాదనకుర్తి వద్ద గోదావరినదీ తీరాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఉపవాసదీక్షలు పాటిస్తూ రాత్రి జాగరణలో ఆధ్యాత్మిక భక్తి గీతాలు ఆలపిస్తూ భగవన్నామస్మరణ చేశారు.

శివరాత్రిపూజలో ప్రముఖులు

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని పలువురు ప్రముఖులు ప్రధాన ఆలయాల్లో స్వామివారి దర్శనం చేసుకున్నారు. కొందరు అభిషేకం చేశారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దంపతులు కదిలి పాపహరేశ్వర ఆలయం అభిషేకం చేశారు. మాజీ ఎంపీ బీజేపీ నాయకుడు రమేష్‌రాథోడ్‌ ఖానాపూర్‌ నియోజకవర్గంలోని రంగం పేట, దిలావర్‌పూర్‌, గొడిసిర్యాల తదితర శివాల యాల్లో ప్రత్యేకపూజలో పాల్గొన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకుడు రావుల రాంనాథ్‌ బూరుగుపల్లి శివాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి అభిషేకం, మహాహారతిలో పాల్గొన్నారు. గండిరామన్న శివాలయంలో శివలింగానికి యజ్ఞహోమం, ప్రత్యేకపూజలు చేశారు. ప్రము ఖ పారిశ్రామికవేత్త, హరిహర క్షేత్ర ధర్మకర్తలు అల్లోల మురళీధర్‌రెడ్డి వినో దమ్మ దంపతులు మల్లన్న గుట్టపై రాత్రి నిర్వహించిన కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ప్రత్యేకపూజలు చేశారు.

కదిలిలో జడ్జి పూజలు

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శనివారం నిర్మల్‌ కోర్టు జూనియర్‌ సివిల్‌జడ్జి అజయ్‌కుమార్‌ పాపహరేశ్వరుడిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేకపూజలు చేశారు. కమిటీ సభ్యులు జడ్జిని సన్మానించారు.

ఆలయ పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు

ఆయా ఆలయ కమిటీలు శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. బారికేడ్ల నిర్మాణం చేశా రు. ఆలయ పరిసరాల్లో తాగునీటి సౌకర్యం కల్పించారు. కదిలి పాపహరే శ్వరాలయం సమీపంలో నిర్మల్‌ కు చెందిన శ్రీధర్మశాస్త్ర యూత్‌ ఆధ్వర్యం లో భక్తులకు వాటర్‌బాటిల్స్‌ పంపిణీ చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు సయ్యద్‌హైదర్‌ బాబాపూర్‌ ఆలయాన్ని సందర్శించి భక్తులకు మంచినీటి ప్యాకెట్లు అందజేశారు.

భక్త జనసంద్రమైన కదిలి

దిలావర్‌పూర్‌ : కదిలి అడవుల్లో కొలువుదీరిన శ్రీ మాతాన్న పూర్ణ పాపహరేశ్వరస్వామి సన్నిధికి శనివారం భక్తులు పోటెత్తారు. మహా శివ రాత్రి అందులో శనిత్రయోదశి కావడంతో స్వామివారి దర్శనభాగ్యం కోసం శనివారం తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలైంది. ఉమ్మడి ఆదిలా బాద్‌ జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. పండ్లు, పూజలు సమర్పించారు. అభిషేక పూజలు చేశారు. కొందరు భక్తులు స్వామివారికి కోడెదూడలను ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల శివ నామస్మరణతో పాపన్న లొద్ది మార్మోగింది. సుమారు 30 వేల నుంచి 35 వేల వరకు భక్తులు వచ్చినట్లు అంచ నా వేశారు. పాపహరేశ్వరస్వామి దర్శనం కోసం గంటల తరబడి బారులు తీరారు. క్యూలో ఉన్న భక్తులకు తాగునీరు. అరటిపండ్లను పంపిణీ చేశారు. గుండంపల్లి, నర్సాపూర్‌(జి) ఉన్నత పాఠ శాలలకు చెందిన ఎన్‌సీసీ విద్యార్థు లు సేవలందించారు. నిర్మల్‌ రూరల్‌ సీఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో దిలావర్‌ పూర్‌ ఎస్సై గంగాధర్‌, నర్సాపూర్‌(జి) ఎస్సై గీత నేతృత్వంలో పో లీసులు బందోబస్తు నిర్వహించారు. నిర్మ ల్‌ నుంచి ఆర్టీసీ కదిలి, కాల్వ దేవస్థానా లకు ప్రత్యేక బస్సులు నడిపారు.

Updated Date - 2023-02-19T00:55:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising