ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kumaram Bheem Asifabad: ప్రాణహితకు జలకళ

ABN, First Publish Date - 2023-07-19T22:05:50+05:30

చింతలమానేపల్లి, జూలై 19: మండలంలోని గూడెం గ్రామ సమీపంలో గల రాష్ట్ర సరిహద్దులో ప్రవహిస్తున్న ప్రాణహితనది జలకళ సంతరించుకుంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువనీరు దిగువకు వస్తుండడంతో నీరు పోటెత్తిం దని గ్రామస్థులు తెలిపారు.

చింతలమానేపల్లి, జూలై 19: మండలంలోని గూడెం గ్రామ సమీపంలో గల రాష్ట్ర సరిహద్దులో ప్రవహిస్తున్న ప్రాణహితనది జలకళ సంతరించుకుంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువనీరు దిగువకు వస్తుండడంతో నీరు పోటెత్తిం దని గ్రామస్థులు తెలిపారు. ఇలాగే వర్షాలు కురిస్తే సమీప పంట చేలలోకి వరద నీరు వచ్చే అవకాశం ఉందని రైతులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.

తుమ్మిడిహెట్టి వద్ద..

కౌటాల: మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ఉప్పొంగి ప్రవహిస్తోంది. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలవల్ల నీటిమట్టం పెరిగింది. బుధవారం నాటికి నీటిమట్టం పుష్కర ఘాట్‌లోని మెట్లవరకు రావడంతో ప్రాణహిత నిండుకుండలా కనిపిస్తోంది. ప్రాణహిత, వార్ధా పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ సాదిక్‌పాషా, తహసీల్దార్‌ సాయన్న, ఎస్సై ప్రవీణ్‌ పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో గ్రామస్థులు, మత్స్య కారులు చేపల వేటకు వెళ్లరాదన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

బెజ్జూరు: మండలంలో వర్షాలు కురుస్తున్న నేప థ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ శ్రీపాల్‌ అన్నారు. బుధవారం మండ లంలోని కుశ్నపల్లి, సోమిని గ్రామాల మధ్య ఒర్రెలను పరిశీలించారు. అలాగే పాపన్నపేట గ్రామసమీపంలోని కల్వర్టును పరిశీలించారు. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎవరూ వాగులు దాటకూడదని తెలి పారు. అత్యవసర సమయాల్లో తమకు గాని పోలీసులకు గాని సమాచారం అందించాలని సూచించారు. భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.

Updated Date - 2023-07-19T22:05:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising