ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kumaram Bheem Asifabad: చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ను ఆస్తకిగా తిలకించిన ప్రజలు

ABN, First Publish Date - 2023-08-23T22:04:54+05:30

సిర్పూర్‌(యు), ఆగస్టు 23: మండ లంలోని ప్రజలు బుధవారం చంద్ర యాన్‌-3ల్యాండింగ్‌ను అసక్తిగా తిల కించారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్‌-3 బుధవారం ల్యాండింగ్‌ అవుతున్న విషయాన్ని తెలుసు కున్న ప్రజలు బుధవారం మధ్యాహ్నం నుంచి టీవీలముందు కూర్చుని ఆస క్తిగా తిలకించారు.

సిర్పూర్‌(యు), ఆగస్టు 23: మండ లంలోని ప్రజలు బుధవారం చంద్ర యాన్‌-3ల్యాండింగ్‌ను అసక్తిగా తిల కించారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్‌-3 బుధవారం ల్యాండింగ్‌ అవుతున్న విషయాన్ని తెలుసు కున్న ప్రజలు బుధవారం మధ్యాహ్నం నుంచి టీవీలముందు కూర్చుని ఆస క్తిగా తిలకించారు. శాస్త్రవేతలు సంతో షంతో చప్పట్లులు కొట్టగానే ప్రజలు కూడా చప్పట్లుకొడుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

కాగజ్‌నగర్‌: పట్టణంలో బుధవారం రాత్రి చంద్రయాన్‌-3 సంబరాలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పలువురు యువకులు బాణా సంచాను కాల్చారు. అనంతరం ఇస్రో జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. చంద్రయాన్‌ విజయవంతం కావాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు డాక్టర్‌ హరీష్‌బాబు, కార్యకర్తలు హనుమాన్‌ ఆలయంలో పూజలు నిర్వహించారు.

బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

ఆసిఫాబాద్‌: ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 విజయవంతం కావాలని బుధవారం పట్టణంలోని గణపతి దేవాలయంలో బీజేపీ నాయకులు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు విశాల్‌, ప్రకాష్‌, జయరాజ్‌, శ్రీధర్‌, సత్యనారాయణ, సాయి, వినోద్‌, శ్రావణ్‌, ఫణి తదితరులు పాల్గొన్నారు.

జమేదార్‌ బాబా దర్గాలో ప్రార్థనలు

ఆసిఫాబాద్‌ రూరల్‌: చంద్రయాన్‌-3 విజయ వంతం కావాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని జమే దార్‌ బాబా దర్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Updated Date - 2023-08-23T22:04:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising