Kumaram Bheem Asifabad: ఉప్పొంగిన వాగులు.. స్తంభించిన రాకపోకలు
ABN, First Publish Date - 2023-09-21T22:23:49+05:30
బెజ్జూరు/చింతలమానేపల్లి/పెంచికలపేట/సిర్పూర్(టి)/దహెగాం/కౌటాల/కాగజ్‌నగర్, సెప్టెంబరు 21: బెజ్జూరు మండలంలో గురువారం ఉదయం భారీవర్షం కురిసింది. దీంతోవాగులు ఉప్పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. కుశ్నపల్లి- సోమిని గ్రామాలమధ్య లోలెవల్ వంతెనపై భారీగా వరదనీరు పారడంతో రాక పోకలు నిలిచిపోయాయి.
బెజ్జూరు/చింతలమానేపల్లి/పెంచికలపేట/సిర్పూర్(టి)/దహెగాం/కౌటాల/కాగజ్‌నగర్, సెప్టెంబరు 21: బెజ్జూరు మండలంలో గురువారం ఉదయం భారీవర్షం కురిసింది. దీంతోవాగులు ఉప్పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. కుశ్నపల్లి- సోమిని గ్రామాలమధ్య లోలెవల్ వంతెనపై భారీగా వరదనీరు పారడంతో రాక పోకలు నిలిచిపోయాయి. వాగుఅవతల ఉన్న సుస్మీర్,సోమిని,మొగవెల్లి, ఇప్పల గూడ, బండలగూడ, నాగెపల్లి, పాత సోమిని తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచి పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. చింతలమానేపల్లి మండలంలో దిందా వాగు ఉప్పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. మండలకేంద్రంలో పలువురి ఇళ్ల లోకి వర్షంనీరు చేరింది. పెంచికలపేటలో ఉచ్చమల్ల వాగు ఉధృతంగా ప్రవహిం చడంతో ఎర్రగుంట గ్రామానికి రాకపోకలు స్తంభించాయి. గ్రామాల్లో రోడ్లు బురదమయంగా మారాయి. పత్తి,వరిపంటలకు ఈవర్షం అనుకూలమే అయినప్ప టికీ మిర్చి రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతు న్నారు. వరదనీరు చేరి పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. సిర్పూర్(టి) మండ లంలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దహెగాం మండలంలోని జెండాగూడలో చెట్టు విరిగి ఇంటిపై పడింది. లోతట్టు ప్రాంతాల్లోని పంటలు నీట మునిగాయి. కౌటాల మండలంలోని వీరవెల్లి గ్రామపంచాయతీ భవనం భారీ వర్షానికి కూలిపోయింది. కాగజ్‌నగర్‌లో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు నానా ఇబ్బందులు పడ్డారు. గణేష్ మండపాల్లొకి నీరు చేరింది.
Updated Date - 2023-09-21T22:23:49+05:30 IST