ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kumaram Bheem Asifabad: విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయాలి : కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే

ABN, First Publish Date - 2023-09-22T22:57:48+05:30

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 22: విద్యార్థుల్లో దాగిఉన్న సృజ నాత్మకను వెలికితీసేందుకు జిల్లాలోని నాలుగు మండలాల్లో గల 55ప్రభుత్వ పాఠశాలల్లో డెమో స్కూల్‌ ప్రోగ్రాం నిర్వహిస్తామని కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి జిల్లాలో డెమో స్కూల్‌ ప్రోగ్రాంకు ఎంపికైనపాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పంచా యతీ కార్యదర్శులు, కస్తూర్బాగాంధీ విద్యాలయం అధికారులు, ప్రత్యేకాధికారులతో వందరోజుల డెమోస్కూల్‌ ప్రోగ్రాంపై సమీ క్ష నిర్వహించారు.

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 22: విద్యార్థుల్లో దాగిఉన్న సృజ నాత్మకను వెలికితీసేందుకు జిల్లాలోని నాలుగు మండలాల్లో గల 55ప్రభుత్వ పాఠశాలల్లో డెమో స్కూల్‌ ప్రోగ్రాం నిర్వహిస్తామని కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి జిల్లాలో డెమో స్కూల్‌ ప్రోగ్రాంకు ఎంపికైనపాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పంచా యతీ కార్యదర్శులు, కస్తూర్బాగాంధీ విద్యాలయం అధికారులు, ప్రత్యేకాధికారులతో వందరోజుల డెమోస్కూల్‌ ప్రోగ్రాంపై సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యా ర్థులలో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీసే విధంగా అధి కారులు సమన్వయంతో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పాఠశా లల్లో అసెంబ్లీ, క్విజ్‌పోటీలు, వ్యాసరచనపోటీలు నిర్వహించాల న్నారు. పిరమిడ్‌ సభ్యుల సహకారంతో వందరోజుల కార్యక్ర మాన్ని కొనసాగించాలన్నారు. అనంతరం డెమోస్కూల్‌ కార్య క్రమ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు.

ప్రగతి నివేదికలు సమర్పించాలి..

జిల్లాలో 2014నుంచి ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్ర మాలపై ప్రగతి నివేదికలు తయారు చేసి అందించాలని కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 2014నుంచి ఇప్పటివరకు జిల్లాలో చేపట్టిన అభివృద్ధికార్యక్రమాల ప్రగతినివేదికలు తయా రు చేసి అందించాలన్నారు. ఆసరాపెన్షన్‌, రైతుబంధు, రైతు బీమా, రైతురుణమాఫీ లబ్ధిదారులజాబితా,24గంటల ఉచిత విద్యుత్‌ పొందుతున్న రైతుల వివరాలు, సంక్షేమశాఖ ద్వారా లబ్ధిపొందుతున్న లబ్ధిదారుల జాబితా అందించాలన్నారు. జిల్లా సమగ్రఅభివృద్ధి ప్రగతినివేదిక రూపొందించేందుకు అన్ని శాఖల అధికారులు ఈనెల26లోగా తమశాఖల పూర్తివివరాలను సమ ర్పించాలని తెలిపారు. ఎలాంటి పొరపాట్లు, తప్పులు లేకుండా ఖచ్చితమైన సమాచారంతో నివేదిక అందించాలన్నారు. ఏదైనా సమాచారం కొరకు జిల్లా ముఖ్యప్రణాళిక అధికారిని సంప్రదించాలని తెలిపారు.

Updated Date - 2023-09-22T22:57:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising