ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కురిసిన వర్షం.. ఉప్పొంగిన వాగులు

ABN, First Publish Date - 2023-09-22T22:22:19+05:30

మండలంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మండల కేంద్రం సమీపంలోని ఎర్రవాగు ఉప్పొంగి కాజ్‌వే పై నుంచి ప్రవహిస్తోంది. దీంతో లంబాడితాండ, మన్నెగూడం, జంగాల్‌పేట, దమ్మిరెడ్డిపేట, కోనంపేట, కుర్మగూడం ప్రజల రాకపో కలు నిలిచిపోయాయి.

నెన్నెల, సెప్టెంబరు 22: మండలంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మండల కేంద్రం సమీపంలోని ఎర్రవాగు ఉప్పొంగి కాజ్‌వే పై నుంచి ప్రవహిస్తోంది. దీంతో లంబాడితాండ, మన్నెగూడం, జంగాల్‌పేట, దమ్మిరెడ్డిపేట, కోనంపేట, కుర్మగూడం ప్రజల రాకపో కలు నిలిచిపోయాయి. రెవెన్యూ అధికారులు వాగు వద్దకు వెళ్ళి పరిశీలించారు. ప్రవాహ ఉధృతి తగ్గే వరకు వాగు దాట వద్దని ప్రజలకు సూచించారు.

కోటపల్లి: మండలంలో ఎడతెరిపి లేకుండా సుమా రు 2 గంటల పాటు భారీ వర్షం కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. నక్కలపల్లి దారిలోని లోతొర్రె, గొల్లగట్టు వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో సమీ పంలోని పంట చేన్లలోకి నీరు చేరింది. పత్తి పంట నీట మునగడంతోపాటు కొట్టుకుపోయింది. దారిలో రవాణా సౌకర్యాలు నిలిచిపో యాయి. పాలవాగు, బతుకమ్మ వాగులు ఉధృతంగా ప్రవహిం చాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

భీమిని: మండలంలోని చిన్నతిమ్మాపూర్‌ గ్రామ పంచా యతీ పరిధిలోని తంగళ్లపల్లిలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శుక్రవారం ఉదయం ఇందూరి మొండమ్మకు చెం దిన ఇల్లు కూలిపోయింది. ఇల్లు కూలి, గోడలు పెంకులు నేల మట్టమయ్యాయి. రూ.50 వేల వరకు నష్టపరిహారం వాటిల్లిం దని, ఆదుకోవాలని బాధితురాలు కోరారు.

తాండూర్‌(బెల్లంపల్లి): మండలంలోని శనివారం వారసం త, పెట్రోలు బంక్‌ వద్ద ఇటీవల నిర్మించిన రైల్వే అండర్‌ బ్రిడ్జిలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. కురుస్తున్న వర్షాలకు అండర్‌ బ్రిడ్జిలో నీరు నిలిచిపోతుండడంతో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. అచ్చలాపూర్‌, రేచిని, గోపాల్‌నగర్‌, కొత్తగుడిసెలు, తాండూర్‌, గంపలపల్లి వివిధ గ్రామా లకు వెళ్లే వాహనదారులు, ప్రజలు రైల్వే అండర్‌ బ్రిడ్జి నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం బ్రిడ్జిల్లో నీరు నిలిచి ఉండడంతో ప్రమాదకరంగా వాహనాలను తీసుకువెళ్తున్నారు. అధికారులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2023-09-22T22:22:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising