జిల్లా న్యాయసేవా సంస్థ కార్యాలయం ప్రారంభం
ABN, First Publish Date - 2023-01-02T22:29:08+05:30
మంచిర్యాల జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ కార్యాలయాన్ని తెలంగాణ హైకోర్టు చీఫ్ గెస్ట్ ఉజ్జల్ బుయాన్, రాష్ట్ర న్యాయసేవా సాధికార సంస్థ చైర్మన్, హైకోర్టు జడ్జి నవీన్‌రావులు హైదరా బాద్ నుంచి సోమవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
ఏసీసీ, జనవరి 2: మంచిర్యాల జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ కార్యాలయాన్ని తెలంగాణ హైకోర్టు చీఫ్ గెస్ట్ ఉజ్జల్ బుయాన్, రాష్ట్ర న్యాయసేవా సాధికార సంస్థ చైర్మన్, హైకోర్టు జడ్జి నవీన్‌రావులు హైదరా బాద్ నుంచి సోమవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 23 జిల్లా న్యాయసేవా సాధికార సంస్థల ను ఏర్పాటు చేయగా అందులో భాగంగా మంచిర్యాలలో సోమవారం ప్రారంభించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సత్తయ్య మాట్లాడుతూ సేవా సంస్థల ఏర్పాటు ద్వారా పేద వారికి ఉచిత, సమర్ధవంతమైన న్యాయ సహాయాన్ని అందిన్నారు. న్యాయసేవా సాధికార సంస్థల ద్వారా న్యాయ సహాయం అందించడంతోపాటు లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. న్యాయసేవా సాధికార చట్టం 1987ను అనుస రించి ఆర్థిక వెనుకబాటుతనం వల్ల ఎవరికి న్యాయం అందకుండా ఉండకూ డదనే ఉద్దేశంతో మూడు స్థాయిలో కేంద్రంలో, రాష్ట్రంలో, జిల్లా స్థాయిలో న్యాయ సేవా సాధికార సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించడం ద్వారా ప్రజల్లో చట్టాలు, న్యాయ వ్యవ స్థపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. రాజ్యాంగంలోని అధికరణ 39-ఎ ను అనుసరించి 42వ రాజ్యాంగ సవరణ 1976 ప్రకారం ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందిం చడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. న్యాయ సహా యాన్ని అందించడం జడ్జీలు, న్యాయవాదులు, లీగల్ ఎయిడ్ కౌన్సిలర్‌లు, వాలంటీర్ల బాధ్యత అని గుర్తు చేశారు. న్యాయ సహాయం పొందడం ప్రతీ పౌరుని ప్రాథమిక హక్కు అన్నారు. జడ్జీలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2023-01-02T22:29:14+05:30 IST