ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి

ABN, First Publish Date - 2023-09-21T22:23:21+05:30

వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో జరు పుకోవాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు. గురువారం వినాయక నిమజ్జనానికి జిల్లా కేంద్రంలోని మంచిర్యాల పట్టణం, గుడిపేట గోదావరి తీరం ప్రాం తాలను అదనపు కలెక్టర్‌ రాహుల్‌, మోతిలాల్‌, డీసీపీ సుధీర్‌రాంనాధ్‌ కేకన్‌, ఆర్‌డీవో రాములుతో కలిసి పరి శీలించారు.

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 21: వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో జరు పుకోవాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు. గురువారం వినాయక నిమజ్జనానికి జిల్లా కేంద్రంలోని మంచిర్యాల పట్టణం, గుడిపేట గోదావరి తీరం ప్రాం తాలను అదనపు కలెక్టర్‌ రాహుల్‌, మోతిలాల్‌, డీసీపీ సుధీర్‌రాంనాధ్‌ కేకన్‌, ఆర్‌డీవో రాములుతో కలిసి పరి శీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 18న వినా యక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయని, ఈ నెల 28న మిలాద్‌ ఉన్‌నబీ వేడుక ఉన్నందున ప్రజ లందరు మత సామరస్యంతో పండుగలను సంతోషం గా జరుపుకోవాలన్నారు. నిమజ్జన ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, భారీ విగ్ర హాల నిమజ్జనానికి క్రేన్లను వినియోగించాలని అధికా రులను ఆదేశించారు. మంచిర్యాల ఏసీపీ తిరుపతిరెడ్డి, తహసీల్దార్‌లు పాల్గొన్నారు.

దండేపల్లి: వినాయక నవరాత్రుల ఉత్సవాల్లో భాగం గా గణేష్‌ నిమజ్ఞన వేడుకల్లో ఇబ్బందులు తలెత్తకుం డా గూడెం గోదావరి నది వద్ద ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ బాదవత్‌ సంతోష్‌ ఆదేశించారు. గూడెం గోదా వరి వద్ద గణేష్‌ నిమజ్ఞన ఏర్పాటు స్థలాన్ని అధికారు లతో కలిసి పరిశీలించారు. ఎల్లంపల్లి బ్యాక్‌ వాటర్‌తో గూడెం గోదావరి వంతెన నీటిమట్టం అధికంగా ఉన్నం దున నిమజ్ఞన ఏర్పాటుపై జాగ్రత్త చర్యలు చేపట్టాల న్నారు. ఎవరిని నీటిలోకి అనుమతించవద్దన్నారు. క్రేన్‌ల సహాయంతో నిమజ్ఞం చేసే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. గజఈతగాళ్లలను గోదావరి నది ఉం డేలా చూడాలన్నారు. నిమజ్ఞన చేసే స్థలంను చదును చేసి, తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు. గూడెం చెక్‌పోస్టు నుంచి గోదావరి నది వరకు విద్యుత్‌ సౌకర్యంతోపాటు వీధి దీపాలు ఏర్పాటు చేయాల న్నారు. గోదావరి వద్ద పారిశుధ్యం లోపించకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. అదనపు కలెక్టర్‌ రాహుల్‌, డీసీపీ సుధీర్‌ కేకన్‌ రామ్‌నాఽథ్‌, ఏసీపీ తిరుపతిరెడ్డి, సీఐ కృష్ణ, తహసీల్దార్‌ సంధ్యరాణి, ఎంపీడీవో మల్లేషం, ఆర్‌ఐ రంజిత్‌కుమార్‌, దండేపల్లి, లక్షెట్టిపేట ఎస్సైలు ప్రసాద్‌, లక్ష్మణ్‌, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

బెల్లంపల్లి: వినాయక నిమజ్జనం ఏర్పాట్లలో భాగం గా బెల్లంపల్లిలోని పోచమ్మ చెరువును ఆర్డీవో సురేష్‌, ఏసీపీ సదయ్యలు పరిశీలించారు. పోచమ్మచెరువు వద్ద క్రేన్స్‌, ఫెన్సింగ్‌, శానిటేషన్‌, లైటింగ్‌ తదితర పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పనుల్లో నిర్లక్ష్యం చేయవద్దని నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, తహసీల్దార్‌ సుధాకర్‌, ఇన్‌స్పెక్టర్‌ శంకరయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-09-21T22:23:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising