ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జయభారత్‌ సత్యాగ్రహ సభకు భారీ ఏర్పాట్లు

ABN, First Publish Date - 2023-04-13T22:28:07+05:30

సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క చేపట్టిన హాత్‌ సే హాత్‌ జోడో పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రలో భాగంగా శుక్రవారం బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీని క్షేత్రసాయిలో బలోపేతం చేసేందుకు భట్టి విక్రమార్క ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మంచిర్యాల, ఏప్రిల్‌ 13వ (ఆంధ్రజ్యోతి): సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క చేపట్టిన హాత్‌ సే హాత్‌ జోడో పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రలో భాగంగా శుక్రవారం బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీని క్షేత్రసాయిలో బలోపేతం చేసేందుకు భట్టి విక్రమార్క ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. మార్చి 16న ఆదిలాబాద్‌ జిల్లాలోని పిప్రిలో ప్రారంభమైన పాదయాత్ర 280 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. బోథ్‌, ఖానాపూర్‌, కుమరంభీంఆసిఫాబాద్‌, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగగా దాదాపు వందకు పైగా గ్రామాల్లో ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ నేతృ త్వంలో జరుగనున్న బహిరంగ సభకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతు న్నాయి. ఎన్నికల సమరభేరీగానే బహిరంగ సభను కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఖర్గే హాజరవుతుండటంతో రాష్ట్ర అగ్రనేతలు మంచిర్యాలకు చేరుకుంటున్నారు. రోజుకో నేత సభాస్థలిని పరిశీలించి నిర్వాహకులకు సలహాలు సూచనలు అందజేస్తున్నారు.

సభలో భారీ ఏర్పాట్లు...

కాంగ్రెస్‌ సత్యాగ్రహ సభ సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం అవుతుండగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్‌ అతిరథ మహారథులు తరలి వస్తుండటంతో సభను విజయవంతం చేసేలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బహిరంగ సభలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. మొత్తం లక్ష మందితో సభను ఏర్పాటు చేసేం దుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి నలువైపులా పెద్ద మొత్తంలో కాంగ్రెస్‌ జెండాలు ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా కాంగ్రెస్‌ ఫ్లెక్సీలతో రహదా రులు దర్శనమిస్తున్నాయి. భారీ జెండాలు, హోర్డింగులు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారులు, చౌరస్తాలు, కూడళ్లు, విద్యుత్‌ స్తంభాలకు జెండాలు ఏర్పాటు చేశారు. దాదాపు 45 అడుగుల కటౌట్లు, బెలూన్లను ఎగురవే శారు. మంచిర్యాల నియోజక వర్గం నుంచి 75 వేల మందిని తరలిం చేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, బెల్లంపల్లి, చెన్నూరుల నుంచి 25వేల పై చిలుకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రేంసాగర్‌రావు స్థానిక నాయకులకు దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్‌ ఆధ్వర్వంలో నిర్వహి స్తున్న భారీ బహిరంగ సభకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరును ఖరారు చేశారు. ఆయన జయంతి నాడు సభను ఏర్పాటు చేస్తున్నందున అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది.

సభా స్థలికి నేతల తాకిడి...

మంచిర్యాల బహిరంగ సభకు కాంగ్రెస్‌ అగ్రనేతల తాకిడి రోజు రోజుకూ పెరుగుతోంది. బహిరంగ సభ ఏర్పాట్లను ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, పీసీసీ మాజీ అధ్యక్షులు వి హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మాజీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమ కుమార్‌లు ఇప్పటికే ఏర్పాట్లను పర్యవేక్షించగా, గురువారం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజలకు భోజనం, తాగునీరు వంటి కనీస ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

మల్లికార్జున ఖర్గే షెడ్యూలు...

మంచిర్యాలలో ఏర్పాటు చేసే సత్యాగ్రహ సభలో పాల్గొనేందుకు ముఖ్య అతిథిగా అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి 3 గంటలకు హెలీక్యాప్టర్‌లో బయల్దేరి జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలీపాడ్‌ వద్దకు చేరుకుంటారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాన్వాయ్‌లో వేదిక వద్దకు చేరుకుంటారు. సభ అనంతరం రాత్రి స్థానిక అతిథిగృహంలో బస చేయనున్నారు.

సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఠాక్రే

నస్పూర్‌: రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే గురువారం సాయంత్రం నస్పూర్‌లోని సత్యాగ్రహ సభ ప్రాంగణాన్ని పరిశీలించారు. స్థానిక నేతలతో ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. సభకు వచ్చే కార్యకర్తలు, సామాన్య ప్రజలకు భోజనం, ఎండ ఎక్కువగా ఉండడంతో తాగేందుకు మంచినీళ్లు, మజ్జిగ ఏర్పాట్లపై ఆరా తీశారు. సభకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. శుక్రవా రం సాయంత్రం జరుగనున్న బహిరంగ సభకు వేదికతో పాటు మైదానంలో లైటింగ్‌, సౌండ్‌ సిస్టమ్‌ పనులు ప్రారంభించారు. మైదా నంలో దాదాపు 70 వేల కుర్చీలను ఏర్పాటు చేయనున్నారు. సభకు ఏఐసీసీ అద్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ముఖ్య అధితిగా హాజరవవుతుండగా టీపీసీసీ అధ్యక్షుడు రే వంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. మైదానంలో గ్యాలరీలు, ప్రముఖులు వచ్చి వెళ్ళడానికి ప్రత్యేక దారులను ఏర్పాటు చేశారు. సభను విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు.

Updated Date - 2023-04-13T22:28:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising