ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కౌశిక్‌రెడ్డి తీరుపై సీఎంకు ఫిర్యాదు చేస్తా

ABN, First Publish Date - 2023-06-26T01:42:00+05:30

తెలంగాణ సమాజంలో అత్యధిక భాగం గా ఉన్న బీసీల పట్ల ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి అనుసరిస్తున్న తీరు అధికార పార్టీ కి చెడ్డపేరు తెచ్చేలా ఉందని, దీనిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని ఆదిలా బాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే రామన్నకు వినతిపత్రం అందజేస్తున్న ముదిరాజ్‌లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టీకరణ

ఆదిలాబాద్‌, జూన్‌25: (ఆంద్రజ్యోతి) తెలంగాణ సమాజంలో అత్యధిక భాగం గా ఉన్న బీసీల పట్ల ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి అనుసరిస్తున్న తీరు అధికార పార్టీ కి చెడ్డపేరు తెచ్చేలా ఉందని, దీనిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని ఆదిలా బాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. జిల్లాకేంద్రంలో ముదిరాజ్‌ మహా సభ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక అటవీశాఖ విశ్రాంతి భవనంలో కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న స్పందిస్తూ వ్యక్తిగత కోపాలను వ్యవస్థపై రుద్దితే సహిం చేదిలేదని, ముదిరాజ్‌ సామాజిక వర్గంపై ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కౌశిక్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్య ల వల్ల ముదిరాజ్‌ సమాజానికే కాకుండా యావత్‌ బీసీ సమాజానికి తలవంపు తెచ్చేవిధంగా ఉందని, దీనిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే రామన్న తెలిపారు. సమాజంలో సగభాగం ఉన్నా బీసీల పట్ల అనుచితంగా మాట్లా డడం హేయమైన చర్యగా భావిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్‌ జిల్లా మహసభ అద్యక్షుడు శివయ్య, శివకుమార్‌ ,ప్రవీణ్‌, లస్మన్న, భూమన్న. శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

ఫ కౌశిక్‌రెడ్డిని బర్తరఫ్‌ చేయాలి

సిరికొండ: ముదిరాజ్‌ కులస్తులను అసభ్య పదజాలంతో దూశించిన అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డిని తక్షణమే పదవి నుంచి తొలగించి అతనిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని ముదిరాజ్‌ మండల గౌరవ అధ్యక్షుడు ఓరుగంటి పెంటన్న డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ముదిరాజ్‌ నాయకుల ఆధ్వర్యంలో మండలకేంద్రంలో కౌశిక్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ముదిరాజ్‌ బిడ్డ అయిన జర్నలిస్టు అజయ్‌పై దాడి చేసి అతని కెమరా లాక్కుని అసభ్య పదజాలంతో దూశించిన కౌశిక్‌రెడ్డికి తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెంటన్న, మల్లారెడ్డి, అమోల్‌, సుదర్శన్‌, నర్సింలు, విజయ్‌ మల్లేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T01:42:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising