ఘనంగా హనుమాన్ జయంతి
ABN, First Publish Date - 2023-05-14T22:20:05+05:30
పట్టణంలోని పలు ఆంజనేయ స్వామి ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పంచ ముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా వేడుకలు జరిగాయి.
మందమర్రిటౌన్, మే 14 : పట్టణంలోని పలు ఆంజనేయ స్వామి ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పంచ ముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా వేడుకలు జరిగాయి. స్వామి వారికి ఉదయం విశేష అభిషేక పూజలతోపాటు పంచకుండాత్మక హనుమాత్ కవచహవనం పూజలు, యజ్ఞాలను నిర్వహించారు. ఈ పూజలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణకాంతచార్యుల ఆధ్వ ర్యంలో పూజలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
నస్పూర్: నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కాలనీల్లో గల అంజనేయ స్వా మి ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అభయాంజనేయ స్వామి ఆలయంలో ఉదయం నుంచి భక్తులు చేరుకుని స్వామిని దర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధానార్చకులు మారుపాక ఫణికుమార్ శర్మ తెలిపారు.
Updated Date - 2023-05-14T22:20:05+05:30 IST