ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఘనంగా కుంకుమ పూజలు..

ABN, First Publish Date - 2023-09-22T22:19:26+05:30

నస్పూర్‌ కాలనీలోని అభయాం జనేయ స్వామి, హౌసింగ్‌ బోర్డు కాలనీలోని లక్ష్మి గణపతి దేవా లయాల్లో శుక్రవారం సామూహిక కుంకుమార్చన పూజ కార్యక్ర మాలు జరిగాయి. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

నస్పూర్‌, సెప్టెంబరు 22: నస్పూర్‌ కాలనీలోని అభయాం జనేయ స్వామి, హౌసింగ్‌ బోర్డు కాలనీలోని లక్ష్మి గణపతి దేవా లయాల్లో శుక్రవారం సామూహిక కుంకుమార్చన పూజ కార్యక్ర మాలు జరిగాయి. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

భీమారం: ఐబీ చౌరస్తాలో యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపం వద్ద మహిళలు ఘనంగా కుం కుమ పూజలు నిర్వహించారు. అర్చకులు తిరునంగిరి ప్రవీణ్‌కు మార్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఒకరికి ఒకరు వాయినాలు ఇచ్చుకున్నారు.

మందమర్రిరూరల్‌: మండల వ్యాప్తంగా నెలకొల్పిన వినా యక విగ్రహాల వద్ద మహిళలు కుంకుమ పూజలు నిర్వహిం చారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.

మంచిర్యాల కలెక్టరేట్‌: జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్‌నగర్‌లో అంజనిపుత్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధునికి ఎమ్మె ల్యే నడిపెల్లి దివాకర్‌రావు పూజలు చేశారు. అంజనిపుత్ర ఎస్టే ట్స్‌ చైర్మన్‌ గుర్రాల శ్రీధర్‌, ఎండీ పిల్లి రవిలు సన్మానించారు. ఎమ్మెల్యే అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జైపూర్‌ తహసీల్దార్‌ రమేష్‌, కౌన్సిలర్‌ హరికృష్ణ పాల్గొన్నారు.

కరెన్సీతో అలంకరణ

మంచిర్యాల కలెక్టరేట్‌: పట్టణంలోని విశ్వనాధ ఆలయంలో నిర్వహిస్తున్న గణపతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గణ పతిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి దర్శించుకుని పూజలు చేశారు. రూ. 15 లక్షలతో గణపతిని అలంకరించినట్లు వైశ్య సంఘాల చైర్మన్‌ ముక్త శ్రీని వాస్‌ తెలిపారు. అనంతరం మహిళలు కుంకుమార్చనపూజలు చేశారు. రాజేశం, చంద్రశేఖర్‌, జయప్రకాష్‌, రవీందర్‌,జ్యోతి, శ్రీవాణి,వైకుంఠం, విగ్నేష్‌, హరీష్‌,ప్రవీణ్‌ పాల్గొన్నారు.

మందమర్రిటౌన్‌: పట్టణంలోని బాలాజీ స్వీట్‌ హౌజ్‌ వద్ద ప్రతిష్టించిన గణనాథునికి శుక్రవారం రూ. 2.50 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. కరెన్సీ గణనాధున్ని చూసేందుకు భక్తు లు తరలివచ్చారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Updated Date - 2023-09-22T22:19:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising