గడప గడపకూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు : మంత్రి ఐకే రెడ్డి
ABN, First Publish Date - 2023-04-06T01:13:11+05:30
: రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి చేపడు తున్న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పనులు గడప గడపకూ తీసుకెళ్లాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు.
నిర్మల్ కల్చరల్, ఏప్రిల్ 5 : రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి చేపడు తున్న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పనులు గడప గడపకూ తీసుకెళ్లాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఆయన నిర్మల్ మున్సిపల్ పరిధిలోని 42 వార్డు బీఆర్‌ఎస్ ముఖ్యనేతలతో ఆత్మీయ సమ్మేళనాల కార్యాచరణపై దివ్యగార్డెన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ నెల 7 నుంచి నిర్మల్ పట్టణంలో ఆత్మీయ సమ్మేళనాలు జరుగనున్నట్లు చెప్పారు. పార్టీసమైక్యత కోసం ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమంలో సభ్య త్వం తీసుకున్న వారితో పాటు కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని అన్నారు. కౌన్సిలర్లు, కౌన్సిలర్ స్థానానికి పోటీ చేసిన వారు, ఆయా వార్డుల అధ్యక్ష, కార్యదర్శులు హాజరుకావాలని సూచించారు. చైర్మన్ ఈశ్వర్, పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, ఏఎంసీ చైర్మన్ చిలుక రమణ, అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, ఎఫ్‌ఎస్‌సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, వక్ ్ఫ బోర్డు మెంబర్ నజీరుద్దీన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి
దళితుల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన బాబుజగ్జీవన్‌రామ్ ఆశయసాధనకు ప్రతీ ఒక్కరూ పాటుపడాలని అటవీ, దేవాదాయశాఖల మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నిర్మల్‌లోని అంబే ద్కర్ భవనంలో నిర్వహించిన జగ్జీవన్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. కలెక్టర్ కే.వరుణ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, అదనపు కలెక్టర్ రాంబాబు, దళితసంఘాల నాయకులు ముడుసు సత్యనారాయణ, ప్రభాకర్, వెంకట్ స్వామి, అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
Updated Date - 2023-04-06T01:13:11+05:30 IST