ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వార్ధా నదిపై వంతెనకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

ABN, First Publish Date - 2023-01-18T21:55:43+05:30

కౌటాల, జనవరి 18: తెలంగాణ-మహారాష్ట్ర మధ్య మరో వంతెన నిర్మాణం కానుంది. గతంలో సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనప్ప చేసిన విజ్ఞప్తుల మేరకు బుధవారం సీఎంవో స్పందన లభించింది. ఈ మేరకు వార్ధా నదిపై వంతెన నిర్మాణం కోసం ప్రతిపాదనలు, డిటైల్‌ రిపోర్టు పంపించాలని రోడ్లుభవనాలశాఖ అధికారులకు సీఎం వోనుంచి ఆదేశాలువచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సీఎంవో నుంచి ఉత్తర్వులు జారీ

- స్థల పరిశీలన చేసిన ఇంజనీరింగ్‌ అధికారులు

కౌటాల, జనవరి 18: తెలంగాణ-మహారాష్ట్ర మధ్య మరో వంతెన నిర్మాణం కానుంది. గతంలో సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనప్ప చేసిన విజ్ఞప్తుల మేరకు బుధవారం సీఎంవో స్పందన లభించింది. ఈ మేరకు వార్ధా నదిపై వంతెన నిర్మాణం కోసం ప్రతిపాదనలు, డిటైల్‌ రిపోర్టు పంపించాలని రోడ్లుభవనాలశాఖ అధికారులకు సీఎం వోనుంచి ఆదేశాలువచ్చాయి. దీంతో స్పందించిన ఆర్‌ అండ్‌బీ ఎస్‌ఈ పూర్తి నివేదిక తయారుచేసి అందిం చాలని ఆదేశించడంతో బుధవారం కాగజ్‌నగర్‌ ఆర్‌అం డ్‌బీ డీఈ లక్ష్మీనారాయణ, ఏఈ రవికిరణ్‌తో కలిసి బ్రిడ్జి నిర్మించనున్న కౌటాలమండలం గుండాయిపేట వద్ద ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. స్థానిక ఎంపీపీవిశ్వనాథ్‌, డీసీఎంఎస్‌ వైస్‌చైర్మన్‌ మాంతయ్య, గ్రామస్థులతో వార్దానది నీటిప్రవాహం, ముంపు ఏమేర ఉంటుందని, గరిష్ట వరద నీటిప్రవాహంపై వివరాలు నమోదు చేసు కున్నారు. గతంలో తెలంగాణ లోని గుండా యిపేట,మహారాష్ట్రలోని నందివర్ధన్‌ల మధ్య బ్రిడ్జినిర్మిస్తే అన్నివిధాల ప్రజలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే కోనప్ప సీఎంకువినతిపత్రం ఇచ్చారు. దీన్నిపరిశీలించి నివేదికలు ఇవ్వాలని ఆదేశా లు అందాయని డీఈలక్ష్మీనారాయణ చెప్పారు. సుమా రు 700మీటర్ల పొడువులో వంతెన అవసరం ఉంటుం దని, దాదాపుగా 70కోట్ల వరకు అంచనావ్యయం ఉం టుందని ప్రాథమికంగా అధికారులు అంచనావేశారు. ఈసర్వే విషయంపై ఎమ్మెల్యే కోనేరుకోనప్పను సంప్రదించగా వార్ధానదిపై వంతెననిర్మిస్తే ఈప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. సిర్పూర్‌ నియోజక వర్గం వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ అధి కారులు,ప్రజాప్రతినిధులు కమల్‌కిశోర్‌, ప్రకాష్‌,మురళీ, ఉపసర్పంచ్‌ లహంచు, దిలీప్‌, ఆగయ్య, సంతోష్‌, ప్రేంలాల్‌, తుకారాం, కాళీదాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-18T21:55:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising