ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైన్‌ పేరుతో ఘరానా మోసం

ABN, First Publish Date - 2023-06-07T22:41:43+05:30

వైన్‌ కంపెనీలో పెట్టుబడులు పెట్టండి.. భారీగా ఆదాయం పొందండి అంటూ కొందరు కేటుగాళ్లు విసిరిన వలలో వందల మంది చిక్కుకున్నారు. మేము వైన్‌ కంపెనీలో పెట్టుబడి పెడు తున్నాం..

లోగో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- 60 రోజుల్లో మూడు రెట్లు ఇస్తామని ఎర

- బాధితుల నుంచి రూ. 10 లక్షల వరకు వసూలు

- ఉద్యోగులు, వ్యాపారులు అన్ని వర్గాల వారు బాధితులే

- మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసిన కుంభకోణం

మంచిర్యాల, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): వైన్‌ కంపెనీలో పెట్టుబడులు పెట్టండి.. భారీగా ఆదాయం పొందండి అంటూ కొందరు కేటుగాళ్లు విసిరిన వలలో వందల మంది చిక్కుకున్నారు. మేము వైన్‌ కంపెనీలో పెట్టుబడి పెడు తున్నాం.. మీరు ఒక్క బాటిల్‌పై పెట్టుబడి పెట్టండి.. 60 రోజుల్లో మూడు రెట్లు ఇస్తామని నమ్మబలికారు. పెట్టుబ డితోపాటు మీ తరుపున మరికొందరిని చేర్పిస్తే నెలనెలా జీతం ఇస్తామంటూ కోట్లు కొల్లగొట్టారు. మంచిర్యాల జి ల్లాలో ఈ భారీ కుంభకోణం ఆలస్యంగా వెలుగు చూడగా అక్రమార్కులు కోట్ల రూపాయలు కాజేశారు. అనంతరం బోర్డు తిప్పేయడంతో వందల సంఖ్యలో బాధితులు లబోదిబో మంటున్నారు.

వాట్సప్‌ గ్రూప్‌ ద్వారా..

అక్రమార్కులు మొదట ’’ది వైన్‌ గ్రూప్‌ టీడబ్ల్యూజీ’’ పేరుతో వాట్సప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేశారు. తెలిసిన వారం దరినీ అందులో యాడ్‌ చేసి లింక్‌ పంపించారు. లింక్‌ను ఓపెన్‌ చేయడం ద్వారా వైన్‌ గ్రూపులో పెట్టుబడి పెడు తున్నామంటూ సభ్యులకు సమాచారం అందించారు. ముందుగా ఒక బాటిల్‌ కొనుగోలు చేయాలంటూ వివ రించారు. ఆ డబ్బులు పెట్టుబడి పెట్టగా వచ్చే లాభాలు సభ్యులకే అంటూ ప్రచారంతో ఊదరగొట్టారు. ఒక బాటిల్‌ కొంటే 60 రోజుల్లో మూడు రెట్లు ఇస్తామని నమ్మబలి కారు. 85 వేలు పెట్టుబడి పెడితే ప్రతి రోజు 12,310 రూపాయల చొప్పున ఇస్తామని తెలిపారు. అలా 30 రోజు ల్లో 6 లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుందని లెక్కలు వేశారు. కొందరు పెట్టుబడిదారులకు మొదట్లో బాగానే డబ్బులు తిరిగి ఇచ్చారు. కంపెనీ యాజమాన్యం గోవాలో ఉంటుం దని చెబుతూ వచ్చారు. వైన్‌ బాటిల్‌పై పెట్టుబడి పెట్టడ మే కాకుండా చైన్‌ సిస్టంలో 230 మందిని చేర్పిస్తే నెల నెలా 20వేల రూపాయల జీతం వస్తుందన్నారు. దీంతో వేలాది మంది వాట్సప్‌ గ్రూప్‌ సభ్యులుగా చేరారు. దేశవ్యాప్తంగా 1.3 మిలియన్‌ మంది సభ్యులు ఉన్నట్లు సమాచా రం. ఒక్క తెలంగాణ, ఏపీలోనే లక్షల మంది గ్రూప్‌లో చేరినట్లు తెలుస్తోంది. కొంతకా లంపాటు బాటిల్‌ కొన్న వారందరికీ ప్రతీ రోజు సక్రమంగా డబ్బులు ఇచ్చారు. కొందరు డబ్బులను డ్రా చేయగా, మరికొందరు యాప్‌లోనే జమ చేశారు. మే 30 నుంచి వినియోగదారులకు డబ్బులు అందకపోగా, సమాచారం కూడా ఒక్కసారిగా నిలిచిపోయింది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు గ్రూప్‌ సభ్యులు నిర్వాహకులకు ఫోన్‌ చేస్తే తాము గోవాలో ఉన్నా మని కొందరు బదులిచ్చారు. ఆ తరువాత స్పందించడం మానేశారు. దీంతో మోసం జ రిగిందని భావించిన బాధితులు లబోదిబోమంటున్నారు.

బాధితుల్లో జిల్లా వాసులు..

వైన్‌ కుంభకోణంలో ఇరుక్కున్న వారిలో మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, లక్షెట్టిపేట, శ్రీరాంపూర్‌ తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో చేరినట్లు తెలుస్తోంది. బాఽ దితులు తమకు తెలిసిన వారి ద్వారా ఈ గ్రూపులో చేరి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టారు. జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీకి చెందిన ఓ మహిళ ఏకంగా 10 లక్షల రూపా యలు వైన్‌ గ్రూపులో పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. కేవలం ఆమె పెట్టుబడి పెట్టడమే కాకుండా, ఆమె కింద మరికొందరిని కూడా చేర్పించినట్లు తెలుస్తోంది. అలాగే పట్టణానికి చెందిన ఓ వ్యాపారి సైతం 4 లక్షల రూపా యల వరకు పెట్టుబడి పెట్టగా బయటకు చెప్పుకొనేందుకు ముందుకు రావడం లేదు.

Updated Date - 2023-06-07T22:41:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising