ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మౌలిక వసతుల కల్పనలో విఫలం

ABN, First Publish Date - 2023-05-02T21:55:39+05:30

కొలాంగొంది నిర్వాసితులకు మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మానవహక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు భుజంగరావు అన్నారు.

ఆదివాసీలతో మాట్లాడుతున్న మానవహక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు భుజంగరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌రూరల్‌, మే 2: కొలాంగొంది నిర్వాసితులకు మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మానవహక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు భుజంగరావు అన్నారు. మండలంలోని సాలేగూడ గ్రామపంచాయతీ పరిధిలోని కొలాంగొంది పునారవాస కేంద్రాన్ని మంగళవారం మానవ హక్కుల వేదిక సభ్యుల తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2019లో ఫారెస్టు అధికారులు కొలాంగొంది గ్రామంపై దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఈ మేరకు కొలాం తెగకు చెందిన 16 ఆదివాసీ కుటుంబాలను కాగజ్‌నగర్‌ ఎల్లంపల్లి టింబర్‌ డిపోలో బంధించారని తెలిపారు. మానవ హక్కుల సంఘాల ఒత్తిడితో హైకోర్టు ఆదివాసీ కుటుంబాలకు పునారవాసం చూపడంతో పాటు మౌలిక వసతులు క ల్పించాలని అధికారులను ఆదేశించిందని చెప్పారు. హైకోర్టు ఆదేశాల ను తుంగలో తొక్కి అధికారులు నిర్వాసితులకు వసతులు కల్పించడం లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. వెంటనే అధికారులు నిర్వాసి తులకు వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షాన ప్రభు త్వానికి హైకోర్టుకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఆయన వెంట మానవహక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు అతీష్‌కుమార్‌, పరిశోధన విద్యార్థులు దివ్య, సాయిదకుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-05-02T21:55:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising