ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలి

ABN, First Publish Date - 2023-03-05T22:58:01+05:30

నీళ్లు, నిధులు నియామకాలు అనే నినాదంతో ముడిపడిన తెలంగాణ వాదం స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వార్ధపరుల అంతర్గత వలసపాలన, దోపిడి, వివక్ష, అవమానాలతో తెలంగాణ సమాజం కొనసాగుతుందని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది నిరూప్‌, సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి, తెలంగాణ సోషల్‌ మీడియా కన్వీనర్‌ కరుణాకర్‌ దేశాయ్‌లు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మంచిర్యాల కలెక్టరేట్‌, మార్చి 5: నీళ్లు, నిధులు నియామకాలు అనే నినాదంతో ముడిపడిన తెలంగాణ వాదం స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వార్ధపరుల అంతర్గత వలసపాలన, దోపిడి, వివక్ష, అవమానాలతో తెలంగాణ సమాజం కొనసాగుతుందని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది నిరూప్‌, సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి, తెలంగాణ సోషల్‌ మీడియా కన్వీనర్‌ కరుణాకర్‌ దేశాయ్‌లు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్టు హాలులో ‘వెంటిలేటర్‌పై తెలంగాణ ప్రజాస్వామ్యం’ అనే అంశంపై జిల్లాస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరవీరులు, విద్యార్థులు, ఉద్యమకారుల ఆకాంక్షలు, ఆశయాలతో ఏర్పడ్డ స్వరాష్ట్రంలో ఆంధ్రుల అంతర్గత వలస పాలనలో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల మూలంగా గోదావరి నీరంతా ఆంధ్రాకు తరలిపోవడం దారుణమన్నారు. తెలంగాణ రాష్ట్రానికి నష్టాలు జరుగుతున్నా స్వలాభం దృష్ట్యా నోరు మెదపకపోవడం సిగ్గు చేటన్నారు. మంచిర్యాల, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ, కడెం వరద నదులతో గంగా జమున తహజీబ్‌గా వెలుగొందుతున్నా ఇక్కడి రైతులు పంట నష్టానికి గురై అల్లాడుతున్నారమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సీఎం కేసీఆర్‌ ఖజానాను నింపినప్పటికీ ప్రజల దృష్టిలో ఖాళీ ఈశ్వరంగా విపత్తులు సంభవించడం తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. గోదావరి నీటిని మహారాష్ట్రకు తరలించడానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పథకాలు రూపొందిస్తుందన్నారు. రాష్ట్రంలో ఏమి చక్కబెట్టారని దేశ వ్యాప్త పాలన ఆశిస్తున్నా రన్నారు. ఉద్యమ కారులు, మేధావులు ఉద్యమించి మన బతుకులను మనమే బాగు చేసుకోవాలనే నినాదంతో ముందుకు రావాలన్నారు. ప్రజలం దరికి సమాన భాగస్వామ్యం కల్పిం చేందుకు వెంటిలేటర్‌పై ఉన్న ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు ప్రభుత్వంపై ఉద్యమించాలన్నారు. బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ నీలకంటేశ్వర్‌రావు, పలిగిరి కనకరాజు, అన్వర్‌ పటేల్‌, షాబాజ్‌, లింగన్న, నీరటి రాజన్న, దేవి సత్యం, జయకృష్ణ, లింగాల కనకయ్య, రాధిక సమ్మయ్య, జైపాల్‌సింగ్‌, శ్రీనివాస్‌ యాదవ్‌, నీలదేవి, సామాజిక ఉద్యమకారుల ఐక్యవేదిక నాయకులు రంగు రాజేశం, ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T22:58:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising